Begin typing your search above and press return to search.

చైతూ మ‌జ్ను కాడా?!

By:  Tupaki Desk   |   17 Feb 2016 5:30 PM GMT
చైతూ మ‌జ్ను కాడా?!
X
నాగ‌చైత‌న్య 12వ సినిమాగా ప్రేమ‌మ్ రీమేక్ తెర‌కెక్కుతోంది. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నాడు. ఇదొక ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న సినిమా కాబ‌ట్టి మ‌జ్ను అనే పేరును ఫిక్స్ చేసిన‌ట్టు ప్ర‌చారం సాగింది. తండ్రి నాగార్జున టైటిల్ - దానికి తోడు అదొక సూప‌ర్ హిట్ సినిమా టైటిల్ కావ‌డంతో చిత్ర‌బృందం కూడా మ‌జ్ను పేరుపైనే ఆస‌క్తి చూపించింది. అయితే ఇటీవ‌ల మ‌రోసారి స‌మీక్షించుకొన్న యూనిట్ మ‌జ్ను అనే పేరును కాకుండా, య‌థాత‌థంగా ప్రేమ‌మ్‌నే ఫిక్స్ చేయాల‌ని డిసైడైయిన‌ట్టు స‌మాచారం.

మ‌జ్ను అనే పేరుని చూసి అభిమానులు ఎక్కువ‌గా ఎక్స్‌ పెక్ట్ చేస్తే క‌ష్ట‌మ‌ని, ఇదొక ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్రేమ‌మ్ అనే టైటిల్నే పెట్ట‌డం బెట‌ర‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈనెల 19న అధికారికంగా టైటిల్‌ ని ప్ర‌క‌టించ‌డంతో పాటు, ఫ‌స్ట్‌ లుక్‌ ని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్‌ తో పాటు ప్రేమ‌మ్ భామ‌లే అయిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. చైతూ 11వ సినిమాగా చేసిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో కూడా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. రెండు సినిమాల ప్ర‌చారాలూ ఒకేసారి ఊపందుకొనేలా క‌నిపిస్తున్నాయి.