Begin typing your search above and press return to search.
‘ప్రేమమ్’లో ఆ ఎపిసోడ్ నచ్చదనుకున్నాడట
By: Tupaki Desk | 25 Oct 2016 11:30 AM GMT‘ప్రేమమ్’ సినిమా ఒరిజినల్లో కానీ.. తెలుగు వెర్షన్లో కానీ మధ్యలో వచ్చే స్టూడెంట్-లెక్చరర్ ఎపిసోడే ప్రధాన ఆకర్షణ. దాదాపు గంట పాటు సాగే ఈ ఎపిసోడ్ తో ప్రేక్షకులు భలేగా కనెక్టయిపోయారు. సమయం గడుస్తున్నట్లే తెలియకుండా సాగిపోతుంది ఈ ఎపిసోడ్. ఐతే నాగచైతన్యకు మాత్రం షూటింగ్ చేస్తున్నపుడు ఈ ఎపిసోడ్ మెప్పిస్తోందో లేదో అని సందేహం కలిగిందట. ఐతే రీరికార్డింగ్ తర్వాత మాత్రం ఈ ఎపిసోడే సినిమాకు ఆకర్షణ కావచ్చని అనిపించిందట.
‘‘శ్రుతి హాసన్ ఎపిసోడ్ చేస్తున్నపుడు సందేహాలు కలిగాయి. ఫస్ట్.. థర్డ్ ఎపిసోడ్ల గురించి నాకు ఎలాంటి డౌట్లు లేవు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని కాన్ఫిడెంటుగా ఉన్నా. కానీ మధ్యలో ఎపిసోడ్ ప్రేక్షకులకు నచ్చదేమో అనిపించింది. ఐతే ఈ ఎపిసోడ్ కు రీరికార్డింగ్ పూర్తయ్యాక మాత్రం మరోలా అనిపించింది. దీని రేంజే మారిపోయింది. సౌండ్ ఎఫెక్ట్స్ జోడించాక అది చాలా అట్రాక్టివ్ గా మారింది. నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. రాజేశ్ మురుగేశన్ అంత బాగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు’’ అని చైతూ తెలిపాడు.
ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా ముందుగా ‘ఎవరే’ పాటను రిలీజ్ చేసినపుడు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందని.. అది చూసి చాలా భయపడ్డానని.. మొత్తంగా ఈ సినిమా మిస్ ఫైర్ అయిపోతుందేమో అని కంగారు పడ్డానని చైతూ చెప్పాడు. ఐతే డైరెక్టర్ చందూ మాత్రం మొదట్నుంచి సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడని చైతూ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/