Begin typing your search above and press return to search.
222 రోజులు.. చైతూ బీట్ చేస్తాడా?
By: Tupaki Desk | 10 Jan 2016 4:13 AM GMT2015 సౌత్ ఇండస్ర్టీ బ్లాక్ బస్టర్స్ లో ప్రేమమ్ ఒకటి. ఆల్ఫోన్స్ పుథీరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మల్లూవుడ్ లో సంచలన విజయం సాధించింది. అన్ని ఇండస్ర్టీస్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అందుకే ఈ సినిమాపై అన్ని పరిశ్రమల నుంచి హీరోలంతా మనసు పారేసుకున్నారు. ముఖ్యంగా తెలుగ హీరో నాగచైతన్య వెంటపడి మరీ కొనుక్కున్నాడు. చందు మొండేటి చేత స్ర్కిప్టును అనువదింపజేసుకుని సెట్స్ కెళ్లాడు. ష్యూర్ షాట్ గా హిట్ కొట్టేస్తా అన్న నమ్మకంతో ఈ సినిమా కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. డే అండ్ నైట్ శ్రమించేందుకు వెనకడాడం లేదు. ఒకే క్యారెక్టర్ లో మూడు వేరియేషన్స్ - మూడు దశల్ని చూపించాలంటే బోలెడంత ఫిజికల్ శ్రమ అవసరం. ఆ పనులన్నీ చేస్తున్నాడు. అయితే చైతూ పడుతున్న శ్రమ రియాలిటీలో ఫలిస్తుందా? అన్నదే ప్రస్తుతం వెయ్యి డాలర్ల ప్రశ్న.
నివిన్ పౌళీ నటించిన ప్రేమమ్ ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ముఖ్యంగా నాన్ లోకల్ అయిన తమిళనాడులో ఓ థియేటర్ లో రికార్డు వసూళ్లు చేస్తోంది. ఇప్పటికీ ఎలాంటి బ్రేక్ లేకుండా ఆడేస్తోంది ఈ సినిమా. చెన్నయ్ నగరంలో ఉన్న మలయాళీలు మళ్లీ మళ్లీ థియేటర్ కి వెళ్లి చూస్తుండడం సిటీలో చర్చకొచ్చింది. ఇప్పటికి 222 రోజులు పూర్తి చేసుకుని దిగ్విజయంగా కొనసాగుతోందింకా. అందుకే ఈ స్థాయి విజయం, ఈ స్థాయి ఐడెంటిటీ చైతూ నటిస్తున్న ఈ రీమేక్ వెర్షన్ కి కూడా దక్కుతుందా? చైతూకి కూడా మాతృకలోని హీరోకి వచ్చినంత గుర్తింపు వస్తుందా? ఇలాంటి యక్షప్రశ్నలన్నిటికీ సమాధానం ప్రాక్టికల్ గా రావాల్సి ఉంది మరి. అదంతా చైతూ- మొండేటి చేతిలోనే ఉంది మరి. ఏం చేస్తారో చూడాలి.