Begin typing your search above and press return to search.

ప్రేమమ్.. కొత్త రిలీజ్ డేట్

By:  Tupaki Desk   |   6 Sep 2016 10:38 AM GMT
ప్రేమమ్.. కొత్త రిలీజ్ డేట్
X
నాగచైతన్య అభిమానులేమీ కంగారు పడనక్కర్లేదు. ‘ప్రేమమ్’ వాయిదా ఏమీ పడిపోలేదు. అనుకున్న దాని కంటే ఒక రోజు ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరాకు రావాల్సిన ‘ధృవ’ వాయిదా పడిపోవడంతో ‘ప్రేమమ్’ రిలీజ్ డేట్‌ ను ప్రిపోన్ చేశారు. అక్టోబరు 8న కాకుండా 7నే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపాడు.

ఏడో తారీఖు శుక్రవారం. ఐతే ఆ రోజు ‘ధృవ’ వస్తుందన్న ఉద్దేశంతో మరుసటి రోజుకు ‘ప్రేమమ్’ అనుకున్నారు. ఐతే ‘ధృవ’ వాయిదా పడటంతో వీకెండ్ అడ్వాంటేజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. దసరాకు ఇంకా చాలా సినిమాలు రేసులో ఉన్నప్పటికీ.. ‘ప్రేమమ్’ ఫస్ట్ ఛాయిస్ అవుతుందని అంచనా. ప్రస్తుతం రేసులో ఉన్నవాటిలో పెద్ద సినిమా.. అత్యధిక అంచనాలున్న చిత్రం ఇదే.

‘ప్రేమమ్’ టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 20న ఆడియో వేడుకను ఘనంగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకంటే ముందు ఈ గురువారం ‘ప్రేమమ్’లోని బ్యాంగ్ బ్యాంగ్ అనే పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ‘ఎవరే’ ఆడియో.. వీడియో పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన శ్రుతి హాసన్.. మడోన్నా సెబాస్టియన్.. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. గోపీసుందర్-రాజేష్ మురుగేశన్ సంగీతాన్నందించారు.