Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో చైతు రీమేక్ మూవీ
By: Tupaki Desk | 24 April 2018 8:40 AM GMTఒకేసారి రెండు భిన్న ధృవాలు కలిగిన ప్రేమ కథలు చేయటం ఏ హీరోకైనా అరుదైన అవకాశమే. బాలీవుడ్ ఫేం అర్జున్ కపూర్ కు అలాంటి అదృష్టం దక్కింది. ఇప్పటికే లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అర్జున్ కపూర్ తాజాగా ప్రేమమ్ కూడా ఓకే చెప్పడం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అర్జున్ రెడ్డి రీమేక్ ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ ఫైనల్ గా ఒక కొలిక్కి వచ్చాయి. సందీప్ రెడ్డి వంగానే దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ప్రేమమ్ విషయానికి వస్తే అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. ఇతను గతంలో కైపోచే-రాక్ ఆన్ లాంటి విభిన్నమైన సినిమాలను టేకప్ చేసిన అనుభవం ఉంది. ప్రేమమ్ లాంటి సెన్సిటివ్ లవ్ స్టొరీ బాలీవుడ్ లో కూడా వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకంతోనే ఇది సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు.
మలయాళంలో నివిన్ పౌలి హీరోగా వచ్చిన ఈ మూవీ అక్కడ చరిత్ర తిరగరాయగా తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చి ఇక్కడా సూపర్ హిట్ అనిపించుకుంది. దీని ద్వారానే అనుపమ పరమేశ్వరన్-సాయి పల్లవి గొప్ప కెరీర్ అందుకున్నారు. హిందిలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అర్జున్ కపూర్ గతంలో ఒక్కడు రీమేక్ లో నటించాడు కాని అది ఆశించిన విజయం దక్కించుకోలేదు. ఈసారి మాత్రం ఏకంగా రెండు సౌత్ సినిమాల రీమేక్ పై కన్నేసాడు. ఇవి ఖచ్చితంగా తనకు మేజర్ బ్రేక్ ఇచ్చే సినిమాలు అవుతాయని బలంగా నమ్ముతున్నాడు. ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ సవితి చెల్లెలు శ్రీదేవి కూతురు జాన్వీ డెబ్యు మూవీ కూడా రీమేక్ కావడం విశేషం. మరాటి బ్లాక్ బస్టర్ సైరాట్ రీమేక్ ధడక్ ద్వారా తను ఎంట్రీ ఇస్తోంది