Begin typing your search above and press return to search.
మంచు కురిసే వేళలో మల్లెపువ్వు చెంతనే
By: Tupaki Desk | 6 Feb 2022 2:30 AM GMTమంచు కురిసే వేళలో మల్లెపువ్వంటి మగువతో సరసం విరసం ఎలా ఉంటుందో ఇదిగో ఇక్కడ ఈ మగువను చూస్తే అర్థమవుతోంది. పక్కనే చెలికాడు అలా ల్యాప్ టాప్ లో కష్టపడుతుంటే పాపం ఆ చలి గిలిని ఆపేదెలా? అందుకే ఇలా దుప్పటి కప్పేస్తోంది. నిజానికి ఇది దుప్పటి కప్పే సీజనే.. రష్యాలో అయితే మరీ చలి ఎక్కువ. అతి శీతల ప్రదేశంలో షూటింగ్ అంటే ఆషామాషీ కాదు. అందుకే ఇలా రాశీ ఖన్నా .. చైతన్యకు దుప్పటి కప్పుతోంది. అయితే శీతల ప్రదేశంలో ఇలా ఈ జంట ఇంతగా శ్రమించడం చూస్తుంటే ఇది నిజమైన త్యాగమేనని అనిపిస్తోంది. మైనస్ 18 డిగ్రీల చలిలో మంచు శిఖరాలకు చేరువలో షూటింగ్ కోసం ఈ జంట ఒప్పుకోవడమే గొప్ప. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ కోసం ఈ ఇబ్బందికి కూడా ఒప్పేసుకున్నారు. అనంతరం సుదూర ప్రాంతానికి షూట్ కోసం వెళ్లిపోయారు.
అయితే ఇలా రష్యాలోనే ప్లాన్ చేయడానికి వాస్తవ కారణం కూడా తెలిసొచ్చింది. నిజానికి రష్యా దేశం అక్కడ షూట్ చేసే సినిమాలకు మనీ బ్యాక్ పాలసీని ఆఫర్ చేస్తోంది. ఇంగ్లండ్ తరహాలోనే ఇక్కడ ఈ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకునే వీలుంది. షూటింగ్ కోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం లెక్కించి అందులోంచి మెజారిటీ మొత్తం వెనక్కి ఇస్తుంది. సినిమా ఫైనల్ కాపీని వారికి చూపించిన తర్వాత దాదాపు 90 శాతం తిరిగి ఇచ్చేస్తారు. టాలీవుడ్ లో ప్రముఖ బ్యానర్లు అన్నీ విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేయడానికి కారణం కూడా ఇదే.
యూరోపియన్ దేశాలు.. బ్రిటన్ .. రష్యా సహా పలు దేశాల్లో ఈ తరహా ఫెసిలిటీ ఉంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి.. వాస్తవానికి యూరోపియన్ దేశాలు సినిమాల కోసం అలాంటి ఆఫర్ లతో ముందుకు వస్తాయి. ఆ నిర్దిష్ట సినిమాల్లో చూసిన తర్వాత ప్రజలు ఆ ప్రదేశాలను సందర్శించడానికి వస్తారని తమ దేశ రెవెన్యూ పెరుగుతుందనేది దీని వెనక ఉద్ధేశం. థ్యాంక్యూ మూవీకి తిరిగి రిఫండ్ వస్తుందా లేదా? అన్నది అటుంచితే రష్యాలోని ఎగ్జోటిక్ లొకేషన్లను చై- రాశీ జంట ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. చలి గిలి కాలం ఇలా దుప్పట్లో దూరితే అంతేగా! అంటూ ఈ ఫోటో చూడగానే కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ స్క్రిప్ట్ డిమాండ్ మేరకే అని అంటారా? లేక రిఫండ్ ప్యాకేజీలోనే ఇది ఒక భాగం అంటారా? థాంక్యూ టీమ్ నే అడగాలి.