Begin typing your search above and press return to search.

షర్ట్ విప్పుతున్న అక్కినేని హీరో

By:  Tupaki Desk   |   29 Jun 2018 12:08 PM IST
షర్ట్ విప్పుతున్న అక్కినేని హీరో
X
బాలీవుడ్ దాదాపు కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ కూడా ఈ రోజుల్లో బాడీ పెంచడంలో చాలా వర్కౌట్స్ చేస్తారు. ఎలాంటి కథలకైనా సరే చాలా కసరత్తులు చేస్తారు. ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా దాదాపు అందరూ కుర్ర హీరోలు ఫిట్ నెస్ పై శ్రద్ద వహిస్తున్నారు. కాస్త యాక్షన్ సీన్ తగిలినా కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వాస్తోందని జిమ్ లో గంటల తరబడి వర్కౌట్స్ చేస్తున్నారు.

ఇకపోతే నాగ చైతన్య కూడా తన నెక్స్ట్ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడు. ఇప్పటివరకు యాక్షన్ సీన్స్ చేసినప్పటికీ ఈ కుర్ర హీరో ఫుల్ మాస్ తరహాలో నటించి హిట్టు కొట్టలేదు. ఇక ఈ సారి సవ్యాసాచి సినిమాతో నాగ చైతన్య ఫుల్ ఫిట్నెస్ లో కనిపించనున్నాడట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే అందులో చైతు రొమ్ము విరవడం చూసి అందరూ ఆశ్చర్య పోతారట. షర్టు విప్పేసి రచ్చ చేశాడట. దర్శకుడు చెప్పిన విధానంలో ఏ మాత్రం పొరపాటు లేకుండా చైతు కరెక్ట్ గా చేశాడట.

ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య సీన్స్ లలో ప్రాణం పెట్టి నటించేస్తున్నాడని ఇరగదీసాడని దర్శకుడు చాలా ఆనందపడిపోతున్నాడట. ఈ సినిమా హిట్టు అయితే ఇద్దరికి లాభమే. చందు మొండేటి కూడా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోవాలంటే ఈ సినిమా ఆడియెన్స్ కి నచ్చాలి. ఇక సినిమాలో హీరో కి సూపర్ పవర్స్ ఉంటాయని తెలుస్తోంది. ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.