Begin typing your search above and press return to search.

ఎంట్రీ మూవీకే చైతు అంత డిమాండ్ చేశాడా?

By:  Tupaki Desk   |   9 Aug 2022 6:51 AM GMT
ఎంట్రీ మూవీకే చైతు అంత డిమాండ్ చేశాడా?
X
కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య.. త‌క్కువ స‌మ‌యంలోనే క్లాస్, మాస్ చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సైలెంట్ గా ఉంటూనే సాలిడ్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటున్నాడు. వ్య‌క్తిగ‌త జీవితం ఎలా ఉన్నప్ప‌టికీ.. దాన్ని ప్ర‌భావం వృత్తిపై ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టిన చైతు.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్ట‌బోతున్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తో క‌లిసి చైతు `లాల్ సింగ్ చ‌డ్డా` అనే మూవీ చేసిన సంగ‌తి తెలిసిందే. అద్వైత్ చందన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధిక చౌదరి క‌లిసి నిర్మించారు. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ గా న‌టిస్తే.. చైతు అమీర్ స్నేహితుడు `బోడి బాలరాజు`గా కనిపించబోతున్నాడు.

కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంత‌రం ఆగ‌స్టు 11న హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో.. మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే చైతు కూడా అమీర్ ఖాన్ తో క‌లిసి వ‌రుస ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి చైతు అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. `లాల్ సింగ్ చ‌డ్డా` చైతు చేస్తున్న తొలి హిందీ చిత్రం. అయితే ఎంట్రీ మూవీ అయిన‌ప్ప‌టికీ.. చైతు రెమ్యున‌రేష‌న్ ను భారీగా డిమాండ్ చేశాడ‌ట‌.

మామూలుగా తెలుగులో ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అందుకునే చైతు.. `లాల్ సింగ్ చద్దా` కోసం సుమారు రూ. 5 కోట్లు పుచ్చుకుంటున్నాడ‌ని బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

హీరో రోల్ కాన‌ప్ప‌టికీ రూ. 5 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాద‌నే అంటున్నారు. ఇక మ‌రి ఈ సినిమాతో బాలీవుడ్ లో చైతు ఏ మేర‌కు క్లిక్ అవుతాడో చూడాల్సి ఉంది.