Begin typing your search above and press return to search.

పెళ్లి ముహూర్తం చెప్పేసిన చైతు

By:  Tupaki Desk   |   21 May 2017 5:30 AM GMT
పెళ్లి ముహూర్తం చెప్పేసిన చైతు
X
అక్కినేని నాగ చైతన్య- సమంత ఏళ్ల తరబడి ప్రేమించుకుని ఎట్టకేలకు ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే నిశ్చితార్ధం కూడా పూర్తయిపోగా.. త్వరలో పెళ్లి కూడా జరగనుంది. ఇద్దరి కెరీర్ కీలక దశలో ఉండడంతో వచ్చే ఏడాది వీరి పెళ్లి జరుగుతుందని అంతా అనుకున్నారు కానీ.. అనుకోని కారణాలతో పెళ్లి ముహూర్తాన్ని ముందుకు జరిపారు.

ఈ ఏడాదిలోనే చెయ్-శామ్ ల పెళ్లి అనే విషయంలో జనాలకు ఇప్పటికే క్లారిటీ ఉంది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తో చైతు నటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం' మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నాగ చైతన్య.. సమంతతో తన పెళ్లి విషయంపై కూడా డీటైల్స్ చెప్పేశాడు. అక్టోబర్ లో తమ పెళ్లి జరగనుందనే సంగతిని రివీల్ చేసేశాడు. ముహూర్తం ఇంకా ఖాయం కాకపోయినా.. అక్టోబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నామని తేల్చేశాడు. అయితే.. ఎక్కడ పెళ్లి చేసుకోనున్నారనే సంగతి ఇంకా తేలకపోయినా.. హిందు-క్రిస్టియన్.. రెండు విధానాల ప్రకారం తమ పెళ్లి జరగనుందని చెప్పాడు నాగ చైతన్య. అయితే అక్టోబర్ 6న వీరు గోవాలో పెళ్ళిచేసుకోనున్నట్లు రూమర్లు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ మధ్య సమంత షేర్ చేస్తున్న ఫోటోల్లో చైతు వంట చేస్తున్న పిక్స్ ఎక్కువగా ఉన్న సంగతిపై కూడా చెప్పాడు. తనకు వంట చేయడం అంటే ఇష్టమని.. యూట్యూబ్ లో చూసి చాలా రకాలు నేర్చుకున్నానని చెప్పిన చైతు.. వాటిలో అనేకం సమంతకు చేసి పెడుతుంటానని.. తన వంటలు ఆమెకు బాగా నచ్చుతాయని అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/