Begin typing your search above and press return to search.

చైతూను బుక్ చేసే టైమొచ్చింది

By:  Tupaki Desk   |   16 Jun 2016 3:30 PM GMT
చైతూను బుక్ చేసే టైమొచ్చింది
X
వెనుక చాలా పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా చాలా సింపుల్ గా ఉంటుంటాడు నాగచైతన్య. స్టార్ ఫ్యామిలీస్ లో అత్యంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే హీరోల్లో చైతూ ఒకడు. సినిమాల్లో అతడి పాత్రలు ఎంత సింపుల్ గా ఉంటాయో.. బయట కూడా అంతే సింపుల్ గా కనిపిస్తుంటాడతను. పబ్లిక్ ఫంక్షన్లలో.. పార్టీల్లో పెద్దగా కనిపించడు. మీడియాతో మాట్లాడడు. మొత్తంగా చైతూ చాలా భిన్నం అని చెప్పాలి. ఐతే అసలే కుర్రాడు లో ప్రొఫైల్ అంటే.. ఈ మధ్య సమంత పుణ్యమా అని అసలు బయటెక్కడా కనిపించకుండా పోయాడు. సమంత.. చైతూ పేరు చెప్పకపోయినా.. ఆమెను పెళ్లి చేసుకోబోయేది అతడే అని దాదాపుగా అందరూ ఓ అభిప్రాయానికి వచ్చేశారు.

ఐతే ఏదైనా చైతూ నోటి నుంచి కన్ఫర్మేషన్ వచ్చేస్తే ఓ పనైపోతుందని మీడియా వాళ్లు అతడి కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఐతే అతను మాత్రం ఎక్కడా దొరకట్లేదు. చివరికి తన తాతయ్య రామానాయుడు జయంతి కార్యక్రమాల్లో కూడా చైతూ కనిపించలేదు. ఎక్కడ మీడియావాళ్లకు దొరికిపోతానన్న కంగారే చైతూ అలా సైడైపోవడానికి కారణం అనుకుంటున్నారంతా. ఐతే ఈ శుక్రవారం చైతూ తప్పగా పాల్గొనాల్సిన ప్రోగ్రాం ఉంది. అదే.. ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో వేడుక. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో ఈ ఫంక్షన్ చేయబోతున్నారు. కాబట్టి చైతూ మీడియాను ఫేస్ చేయక తప్పదు. వాళ్ల నుంచి తన ప్రేమ-పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కోకా తప్పదు. మరి చైతూ ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.