Begin typing your search above and press return to search.

అల్లుడు ఇబ్బంది పెడుతున్నాడు

By:  Tupaki Desk   |   6 April 2018 5:11 AM GMT
అల్లుడు ఇబ్బంది పెడుతున్నాడు
X
సినిమాను ఫైనల్ స్టేజ్ లో తెగ చెక్కుతాడని దర్శకుడు మారుతికి పేరుంది. కానీ ముందు మాత్రం చకచకానే తీసేస్తూ ఉంటాడు. చివరకు వచ్చేసరికి ఫైన్ ట్యూన్ పేరుతో టైం ఎక్కువ తీసుకుంటాడని అంటారు. కానీ ప్రస్తుతం రూపొందిస్తున్న మూవీ విషయంలో మాత్రం ఆరంభం నుంచి ఆలస్యం అవుతోందట. ఇందుకు కారణం మారుతి కాదని తెలుస్తోంది.

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు అనే సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం గురించి మాటలు చాలాకాలంగా వినిపిస్తోన్నా.. ఇప్పటికి ఒక షెడ్యూల్ మాత్రమే షూటింగ్ పూర్తయింది. రెండు వారాల షూటింగ్ మాత్రమే చేశారు. నాగ చైతన్య నుంచి డేట్స్ కేటాయింపు ఆ మేరకు మాత్రమే జరిగింది. సవ్యసాచి మూవీలో నటిస్తున్న చైతు.. మే నెలలో దాన్ని రిలీజ్ చేయాల్సి ఉండడంతో ఆ ప్రాజెక్టుకే ఇంపార్టెన్స్ ఇస్తూ.. మధ్యలో బ్రేక్ వచ్చినపుడు శైలజా రెడ్డి అల్లుడు చేశాడు. ప్రస్తుతం సమంతతో పాటు అమెరికాలో ఉన్న చైతు.. తిరిగి వచ్చాక కూడా సవ్యసాచికే డేట్స్ ఇస్తాడట.

దీంతో మారుతి సినిమా మరింత ఆలస్యం కానుంది. కానీ చైతు సినిమాను చకచకా తీయాలని భావిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులను సైన్ చేయడమే ఇందుకు కారణం. కానీ చైతు నుంచి మాత్రం సపోర్ట్ అందడం లేదు. అల్లుడు ప్రాజెక్టు అనుకున్న దగ్గర నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు కామెంట్స్ చేస్తున్నాడట మారుతి.