Begin typing your search above and press return to search.
భార్యాభర్తల్లో విజేత ఎవరు?
By: Tupaki Desk | 6 Sep 2018 8:51 AM GMTఇంకో ఎనిమిది రోజులు టైం ఉండగానే అక్కినేని అభిమానులు యమా టెన్షన్ గా ఉన్నారు. కారణం లేకపోలేదు. నాగ చైతన్య ఏడాది తర్వాత కొత్త సినిమాతో వస్తున్నాడు. అది కూడా మాస్ గా అనిపించే అల్లుడిగా శైలజారెడ్డితో సవాల్ చేసే పాత్ర కావడంతో ఎంతవరకు మెప్పించేలా చేసుంటాడా అనే అంచనాల మధ్య ఫ్యాన్స్ చాలానే ఆశిస్తున్నారు. దానికి తోడు చైతు లైఫ్ పార్టనర్ సమంతా కూడా అదే తేదీకి యు టర్న్ తో రావడంతో అటు వైపు కూడా మద్దతు తెలపాల్సిన పరిస్థితి. ప్రాక్టికల్ గా చూసుకుంటే చైతు కంటే యూత్ లో ప్రేక్షకుల్లో సమంతాకే ఎక్కువ క్రేజ్ ఫాలోయింగ్ ఉంది. సహజంగానే ఇది ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైతుకు ఇమేజ్ లేదా అంటే ఉంది కానీ సోలోగా విడుదలైన అన్ని థియేటర్లను హౌస్ ఫుల్ చేయించే రేంజ్ కు ఇంకా చేరుకోలేదు. గత చిత్రాలు యుద్ధం శరణం-రారండోయ్ వేడుక చూద్దాం ఫస్ట్ డే కలెక్షన్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. సో చైతు మీద పెద్ద భారమే ఉంది.
ఇక శైలజారెడ్డి అల్లుడులో ఉన్న ఇతర ఆకర్షణల విషయానికి వస్తే హీరోయిన్ అను ఇమ్మానియేల్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా కాస్తో కూస్తో యూత్ ని లాగేసే గ్లామర్ అయితే ఉంది. గీత గోవిందంలో ఒక్క సీన్ చేసినా అలా గుర్తుండిపోయిన అనుకు ఈగోతో రగిలిపోయే పాత్రలో బాగానే స్కోప్ దొరికినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక బాహుబలిలో శివగామిగా చేసాక రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయినా రమ్యకృష్ణ ఇందులో అత్తయ్య నటించడం మాస్ ఆడియన్స్ ని దీని వైపు చూసేలా చేస్తోంది. ఓ నాలుగు టికెట్లు అదనంగా తెగితే ఆ క్రెడిట్ ఆవిడకు కూడా ఇవ్వొచ్చు. ఇన్ని బలాలు కూడగట్టుకుంటే తప్ప శైలజారెడ్డి అల్లుడికి హైప్ రావడం లేదు. సో సామ్ చైతూల మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం మాంచి రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది. నిజ జీవితంలో ఇద్దరూ జంట అయినప్పటికీ టికెట్ కౌంటర్ల దగ్గర మాత్రం ఎవరికి వారు ఒంటరి పోరు చేయక తప్పదు.