Begin typing your search above and press return to search.
చైతూ, సమంతల్లో ఎవరిది పై చేయి కావచ్చు
By: Tupaki Desk | 30 Aug 2018 8:56 AM GMTఅక్కినేని నాగచైతన్య శైలజ రెడ్డి అల్లుడు చిత్రంతో - ఆయన భార్య సమంత ‘యూటర్న్’ చిత్రంతో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీరిద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కావాల్సి వస్తుంది. వచ్చే నెల 13న ఈ రెండు చిత్రాలు వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల కాబోతున్నాయి. ఇద్దరికి కూడా ఆ రెండు చిత్రాలు చాలా కీలకం. శైలజ రెడ్డి అల్లుడు చిత్రంకు మారతి దర్శకత్వం వహించడంతో తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో ఉంది. మారుతిపై నమ్మకంతో ఈ చిత్రంపై చైతూ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక కన్నడంలో తెరకెక్కి సక్సెస్ అయిన ‘యూటర్న్’ చిత్రంను సమంత రెండు సంవత్సరాలుగా రీమేక్ చేయాలని ఆశ పడింది.
రెండు చిత్రాలపై కూడా ఇద్దరు చాలా ఆశలు పెట్టుకున్న ఈ సమయంలో రెండు ఒకే రోజు రావడం కాస్త విచారకరం. కాని తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల అవుతున్నాయి కనుక ఇద్దరు కూడా సర్ది చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి చిత్రాల్లో ఏ చిత్రం పై చేయి సాధిస్తుంది అనేది ప్రస్తుతం ప్రేక్షకుల్లో మరియు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. ఈ రెండు చిత్రాలు కూడా వేరు వేరు జోనర్‌లలో తెరకెక్కాయి. శైలజ రెడ్డి అల్లుడు మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాగా, యూటర్న్ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. రెండు చిత్రాలు కూడా వేరువేరు జోనర్‌లలో తెరకెక్కాయి కనుక రెండు చిత్రాలకు కూడా ఎలాంటి సమస్య ఉండక పోవచ్చు.
ఓపెనింగ్ విషయంలో సమంత మూవీ కాస్త తక్కువగా ఉన్నా, పాజిటివ్ టాక్ వస్తే మాత్రం తప్పకుండా మంచి వసూళ్లను రాబట్టగలదు. పక్కా కమర్షియల్ సినిమా అవ్వడంతో శైలజ రెడ్డి అల్లుడు చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడంతో పాటు, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్స్ నమోదు అవ్వడం ఖాయం. మొత్తం చూసుకుంటే రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రెండు కూడా మంచి వసూళ్లను నమోదు చేయవచ్చు. ఒకవేళ యూటర్న్‌కు నెగటివ్ టాక్ వస్తే మాత్రం కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవచ్చు అనేది ట్రేడ్ వర్గాల వారి అంచనా. సినిమా ఫలితాన్ని బట్టి ఎవరిదో పై చేయి తేలిపోయే అవకాశం ఉంది.