Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకోక‌పోతేనే హ్యాపీ అనేసిన నాగ చైత‌న్య‌

By:  Tupaki Desk   |   12 Jan 2022 3:39 PM GMT
పెళ్లి చేసుకోక‌పోతేనే హ్యాపీ అనేసిన నాగ చైత‌న్య‌
X
అక్కినేని నాగ‌చైత‌న్య‌-స‌మంత మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో వివాహ బంధానికి స్వ‌స్తి చెబుతూ విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఎవ‌రి దారులు వారివి. విడాకుల స‌మంత ఎంతో మ‌నోవేద‌న‌కు గురైన‌ట్లు ఇన్ స్టా వేదిక‌గా త‌న బాధ‌ని వ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేసింది. అయితే చైత‌న్య మాత్రం విడాకుల గురించి ఎక్క‌డా స్పందించ‌లేదు. తాజాగా చైత‌న్య `పెళ్లి చేసుకోక‌పోతేనే హ్యాపీ` అనేసాడు. అవును నిజ‌మే. మ‌రి ఇది త‌న మ‌న‌సులో మాట‌? లేక ఇంకేదైనా కార‌ణ‌ముందా? అన్న‌ది తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. నాగార్జున‌..నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టించిన `బంగార్రాజు` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 14న రిలీజ్అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా చైత‌న్య ప్ర‌మోష‌న్ లో బిజీ అయ్యాడు. ప్ర‌చారంలో భాగంగా జీ తెలుగు ఛాన‌ల్ నిర్వ‌హించిన స్పెష‌ల్ షోకు హాజ‌ర‌య్యారు. దానికి సంబంధించిన ప్రోమో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మ‌రి అంత‌గా అందులో విష‌యం ఏముంది? అంటే సంగ‌తంతా అందులోనే ఉంది మ‌రి . ఈ వీడియోలో చైత‌న్య‌- నాగార్జున న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం `మ‌న్మ‌ధుడు` నుంచి `ఒద్దురా సోద‌రా` అనే పాట‌ను పాడారు. అందులో` పెళ్లి చేసుకోకు హ్యాపీగా ఉండు `అంటూ చైతన్య లైన్ పాడాడు. ఇప్పుడా పాట క్లిప్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేస్తోంది.

ఆ పాట‌ని చైత‌న్య నిజ జీవితంలో ఎదురైన అనుభ‌వాలికి ముడి పెట్టి కామెంట్లు చేస్తున్నారు. పెళ్లంటే ఇష్టం లేని వారు..పెళ్లి చేసుకుని ఇబ్బందుల‌కు గురైన వారు చైత‌న్య మాట‌తో ఏకీభ‌విస్తూ కామెంట్లు పెడుతున్నారు. `పెళ్లంటే నూరేళ్ల మంట` అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి చైత‌న్య నోట సినిమా ప్ర‌మోష‌న్ లో పెళ్లి అనుభ‌వాల గురించి చెప్పించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు క‌నిపించింది. ఇక చైత‌న్య సౌమ్యుడు..మృదుస్వ‌భావం గ‌ల‌వారు అన్న సంగ‌తి తెలిసిందే.