Begin typing your search above and press return to search.

చెయ్-శామ్ ఎంగేజ్మెంట్ హోగయా!!

By:  Tupaki Desk   |   29 Jan 2017 6:31 PM GMT
చెయ్-శామ్ ఎంగేజ్మెంట్ హోగయా!!
X
నాగ చైతన్య-సమంత.. మీడియాలో గత ఆరేడు నెలలుగా వార్తల్లో నానుతున్న ప్రేమజంట. ఎన్ లాకెట్ దగ్గర సమంత లీక్ చేసిన దగ్గర మొదలై.. చివరకు ప్రేమకథను సుఖాంతం చేసే వరకూ వచ్చిన రియల్ లైఫ్ లవ్ స్టోరీ. అఫ్ కోర్స్.. రీల్ లైఫ్ లోనే మొదలైనా.. ఇప్పుడు రియల్ గానే వీళ్లిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది.

జనవరి 29న చైతు-శామ్ ల ఎంగేజ్మెంట్ అని వార్తలు రావడమే తప్ప.. నాగ్ ఫ్యామిలీ నుంచి కానీ.. శామ్ వైపు నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏదీ లేదు. ముందు రోజు ఢిల్లీ రేస్ ట్రాక్ లో ఈ జంట కనిపించడం.. అక్కడి ఫోటోలను షేర్ చేయడంతో.. నిశ్చితార్ధం ఉందా లేదా అనే డౌట్లు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ.. నాగచైతన్య-సమంతల నిశ్చితార్ధం చేసేశారు నాగ్- అమల దంపతులు. దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

చైతు-శామ్ ల జంటతో పాటు.. నాగ్-అమల.. అఖిల్-శ్రేయా భూపాల్ లు మొత్తం కలిసి ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో దిగిన ఫోటో ఈ మొత్తం కార్యక్రమానికి హైలైట్ గా చెప్పచ్చు. శామ్ బుగ్గకు ఓ ముద్దిచ్చి మరీ తన ప్రేమను చాటుకున్నాడు చైతు. హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ నిశ్చితార్ధ వేడుకకు.. అక్కినేని కుటుంబంతో పాటు పలువురు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

నాగ చైతన్య సమంత ఎంగేజ్మెంట్ ఫొటోస్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి : https://goo.gl/ZSbWa8