Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూజివ్: కమ్ములగారి అక్కినేని కాఫీకి డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 3 Dec 2019 7:50 AM GMTఅక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్ తో కలిసి నటించిన 'వెంకీమామ' ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతుండగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా #NC19 షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా గురించి ఒక ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు అదించబోతున్నాం.
ఈ సినిమాకు ఏప్రిల్ 2 రిలీజ్ డేట్ ను నిర్మాతలు ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన సమయంలో డిసెంబర్ రిలీజ్ అని చెప్పారు కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ విడుదల ఆలోచన మానుకున్నారు. తర్వాత ఈ సినిమాను వాలెంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా ఒక లవ్ స్టొరీ కావడంతో అదే డేట్ కు రిలీజ్ అవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఫిలిం మేకర్స్ మాత్రం ఈ సినిమాను సమ్మర్ బరిలో నిలపాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య ఒక మధ్యతరగతి కుర్రాడి పాత్రలో కనిపిస్తాడు. తెలంగాణా యాసలో మాట్లాడతాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. శేఖర్ కమ్ముల -సాయి పల్లవి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక చైతు కూడా 'మజిలీ' విజయంతో మంచి ఫాంలోకి వచ్చాడు. 'వెంకీమామ' సినిమాకు కూడా పాజిటివ్ బజ్ ఉంది. ఇదంతా చూస్తుంటే రిలీజ్ సమయానికి #NC19 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.