Begin typing your search above and press return to search.

అమ్మ గురించి చైతూ మాట్లాడాడు

By:  Tupaki Desk   |   8 May 2016 6:18 AM GMT
అమ్మ గురించి చైతూ మాట్లాడాడు
X
నాగచైతన్య అనగానే అందరికీ అతడి తండ్రి నాగార్జున గుర్తొస్తాడు కానీ.. తల్లి లక్ష్మి తలపుల్లోకి రాదు. రామానాయుడి కూతురైన లక్ష్మి చైతూకు తల్లి అన్న సంగతి తెలిసిందే. చైతూకి టీనేజ్ వచ్చే వరకు రామానాయుడి ఇంట్లోనే పెరిగారు. తల్లి వాత్సల్యాన్ని పొందాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆయన గైడెన్స్ లో పెరిగాడు. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా తన తల్లి గురించి.. ఆమెతో అనుబంధం గురించి మాట్లాడాడు చైతూ. అతనేమన్నాడో చూద్దాం పదండి.

‘‘నేను-అమ్మ.. 18 ఏళ్ల వరకు నాకు తెలిసిన ప్రపంచం మేమిద్దరమే. నన్ను కోప్పడాలన్నా.. ప్రేమించాలన్నా.. నాతో ఆడుకోవాలన్నా.. అన్నిటికీ అమ్మే తోడు. క్రికెట్.. మ్యూజిక్.. ఫొటోగ్రఫీ.. రేసింగ్.. ఏది ఇష్టమంటే అది నేర్పించింది. ఏదైనా కావాలని అడిగితే.. ముందు ఈ పరీక్ష పాసవ్వు.. తెచ్చిపెడతా.. అనేది. ఊరికే వచ్చిందేదీ సంతోషాన్నివ్వదని చెప్పడమే అమ్మ ఉద్దేశం. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆ రంగంలో ఎత్తుపల్లాలు ఆమెకు తెలుసు. అందుకే డిగ్రీ పూర్తయ్యేకే సినిమాలని కచ్చితంగా చెప్పింది. ఓ స్నేహితురాలిగా.. గురువుగా.. గైడ్ లాగా నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది అమ్మే’’ అన్నాడు చైతూ.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం తన తల్లి షాలిని గురించి స్పందించాడు. ‘‘చాలామంది తల్లులు తెలియని భయాలతో పిల్లల్ని బయటికి పంపరు. కానీ మా అమ్మ మాత్రం ఏ విషయమైనా సొంతంగా నేర్చుకోమని బయటికి పంపేది. ఒంటరిగానే ఎక్కడికైనా వెళ్లమనేది. తన వల్లే కూచిపూడి నేర్చుకున్నా. ఊహ తెలిసినప్పటి నుంచి తన కష్టాల్ని ఆమె నా దగ్గర ఎప్పుడూ దాచిపెట్టలేదు. కోపమొస్తే కొట్టడం.. తర్వాత ఆ దెబ్బలకు మందు రాస్తూ కన్నీరు కార్చడం.. అమ్మతో నా చిన్ననాటి జ్నాపకాల్ని తలచుకుంటే ముందే ఇవే గుర్తుకొస్తాయి’’ అని చెప్పాడు తారక్.