Begin typing your search above and press return to search.
అంతా వద్దన్నా ఆ సినిమా చేశాం : చైతూ
By: Tupaki Desk | 24 Oct 2018 2:10 PM GMTఅక్కినేని నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నేడు లాంచనంగా జరిగింది. సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ట్రైలర్ ను లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా నాగచైతన్య కాస్త ఎమోషన్ అయ్యి మరీ మాట్లాడాడు. చైతూ మాట్లాడుతూ.. నాకు 100% లవ్ చిత్రంతో సక్సెస్ ను ఇచ్చిన సుకుమార్ గారు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసేందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎలాంటి టెంప్లేట్ లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడంటూ చైతూ పేర్కొన్నాడు. ఇక ‘సవ్వసాచి’ చిత్రం కథ నాకు చాలా బాగా నచ్చి చేస్తున్నాను అన్నాడు.
దర్శకుడు చందుతో నేను ‘ప్రేమమ్’ చిత్రాన్ని చేశాను. ఆ చిత్రం రీమేక్ అస్సలు వద్దంటూ చాలా మంది అన్నారు. అయినా కూడా నా కోసం ఆసినిమా రీమేక్ చేసేందుకు చందు ముందుకు వచ్చాడు. ఆ సినిమా నా కెరీర్ లో పెద్ద సక్సెస్‌ను దక్కించుకుంది. ఆ సినిమా షూటింగ్ నార్వేలో జరుగుతున్న సమయంలో చందు నాకు ఈ స్టోరీ లైన్ ను చెప్పాడు. అప్పుడే ఇది నాతో చేయమని అడిగితే బాగోదని అనుకున్నాను. ‘ప్రేమమ్’ విడుదలైన తర్వాత కొన్నాళ్లకు చందు నా వద్దకు వచ్చి అప్పుడు చెప్పిన కథతో సినిమా చేద్దామని చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను అన్నాడు.
‘సవ్యసాచి’ చిత్రానికి పెద్ద హైలైట్ మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించడం. ఇక కీరవాణి గారు ఈ చిత్రంకు సంగీతం అందించడంతో పాటు కథ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో ఇలా పలు విషయాల్లో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మాధవన్ గారు, భూమిక ఇలా అన్ని విధాలుగా సినిమా స్థాయి అమాంతం పెరిగింది. మేమిద్దరం అనుకున్న స్థాయికి సినిమా రెట్టింపు అయ్యింది. ఒక మంచి సినిమాను చేశాననే సంతృప్తి ఉందని చైతూ సంతోషంను వ్యక్తం చేశాడు.
సినిమాను నవంబర్ 2న విడుదల చేయబోతున్నట్లుగా చైతూ అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రంలో చైతూకు జోడీగా నిధి అగర్వాల్ నటించింది. ఈ చిత్రంతో పాటు మరో వైపు చైతూ తన సతీమణి సమంతతో కలిసి ‘మజిలి’ అనే చిత్రాన్ని శివ నిర్వాన దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.