Begin typing your search above and press return to search.
రెస్టారెంట్ ఓపెన్ చేసిన నాగ చైతన్య
By: Tupaki Desk | 5 March 2022 7:39 AM GMTయువ సామ్రాట్ నాగచైతన్య మంచి నటుడే కాదు అంతకు మించి బిజినెస్ మెన్. సినిమాల్లోకి రాకముందే బిజినెస్ స్టడీస్ ని పూర్తిచేసారు. ఆ విషయాన్ని నాగార్జున పలు ఇంటర్వ్యూలో సైతం రివీల్ చేసారు. చైతన్య చాలా తెలివైన వాడని..బాగా చదువుకున్నాడని...తన బిజినెస్ ఐడియాలు చాలా ఇన్నో వేటివ్ గా ఉంటాయని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇష్టంతో సినిమాల్లోకి వచ్చినా...బిజినెస్ చేయాలన్న ఆశలు తనకుండేవని కింగ్ మాటల మధ్యలో అనేవారు. అయితే ఇప్పుడా సమయం వచ్చేసింది.
తాజాగా చైతన్య రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. హైదరాబాద్లోని `షోయూ` అనే ఓ రెస్టారెంట్ ని ప్రారంభించారు. క్లౌడ్ కిచెన్ విధానంలో ఇది పనిచేస్తుంది. అత్యుత్తమ ఆసియా వంటకాలన్ని ఇక్కడ మీకు దొరుకుతాయి అంటూ చైతన్య హైదరాబాద్ ప్రజలకు కొత్త వంటకాల్ని పరిచయం చేస్తున్నారు. స్విగ్గీ ద్వారా ఈ వంటకాలన్ని ప్యాకింగ్ రూపంలో ఇంటికి పార్శీల్ చేయబడతాయి. పర్యా వరణ పరిరక్షణ ధ్యేయంగా ఈరకమైన వెసులు బాటునే కల్పిస్తున్నారు.
లైవ్ లో కూర్చుని తినే వెసులుబాటు ఇంకా కల్పించినట్లు లేదు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలోనే ఆ రకమైన వెసులుబాటు కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చైతన్య తను అనుకున్న బిజినెస్ రంగం వైపు కూడా తొలి అడుగు పడింది. నెమ్మదిగా తెలుగు రాష్ర్టాలు సహా మెట్రో పాలిటన్ సిటీస్ లో తన వ్యాపారాన్ని విస్తరించడమే ముందున్న టార్గెట్. రెస్టారెంట్ రంగంలో స్థిరపడితే తదుపరి బిజినెస్ ల వైపు చైతన్య అడుగులు పడే అవకాశం ఉంది.
ఇక చైతన్య సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ప్రస్తుతం విక్రమ్.కె. కుమార్ దర్శకత్వంలో `థాంక్యూ`లో నటిస్తున్నాడు. `మనం` తర్వాత విక్రమ్ తో పనిచేయడం రెండవ సారి. అదే దర్శకుడితో `దూత` అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ఇటీవలే `లవ్ స్టోరీ` ..`బంగార్రాజు` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.