Begin typing your search above and press return to search.
నాగచైతన్య టీమ్ కు కర్ణాటకలో ఎదురు దెబ్బ!
By: Tupaki Desk | 10 Oct 2022 10:30 AM GMTఈ ఏడాది ప్రారంభంలో 'బంగార్రాజు'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు అక్కినేని నాగచైతన్య. 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బరిలో నిలిచి ఆశించిన విజయాన్ని అందుకోలేక యావరేజ్ మూవీగా నిలిచింది. కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటించినా ఫస్ట్ పార్ట్ ని ఏ విషయంలోనూ 'బంగార్రాజు' మ్యాచ్ చేయలేకపోవడంతో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత అయినా భారీ విజయాల్ని డ్యాక్ టు బ్యాక్ సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన నాగచైతన్యకు విక్రమ్ కుమార్ తో చేసిన 'థాంక్యూ', బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'లాల్ సింగ్ చద్దా' బిగ్ షాక్ ఇచ్చాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు సినిమాలు నాగచైతన్యకు తీవ్ర నిరాశను కలిగించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాలు పెట్టుకున్న రెండు సినిమాలు నిరాశకు గురిచేయడంతో ప్రస్తుతం చైతూ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభునే నమ్ముకున్నాడు. తనతో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని నాగచైతన్య చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. NC22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో బేబమ్మ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని మైసూర్ లో ప్రారంభించారు. మాండ్య జిల్లాలోని మేలుకోట సమీపంలో తాజాగా షూటింగ్ ని మొదలు పెట్టారు. అయితే నాగచైతన్య టీమ్ కు మాండ్య జిల్లా యంత్రాంగం బిగ్ షాక్ ఇచ్చింది. షూటింగ్ కోసం ఇచ్చిన అనుమతుల్ని వెంటనే రద్దు చేసింది. కారణం ఏంటంటే మాండ్య జిల్లా మేలుకోట సమీపంలో రాజగోపురం తరహాలో మద్యం విక్రయ కేంద్రం సెట్ వేసి అందులో షూటింగ్ చేస్తున్నారట.
ఇది గమనించిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి స్థానిక పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారట. దీంతో రంగంలోకి దిగిన మాండ్య జిల్లా పాలనా యంత్రాంగం నాగచైతన్య సినిమా షూటింగ్ కు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. షరతులతో సినిమా షూటింగ్ కి అనుమతులు ఇవ్వగా వాటిని చిత్ర బృదం నిబంధనల్ని ఉల్లఘించిందని స్థానిక కన్నడ సంఘాల ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. దీంతో కర్ణాటకలో నాగచైతన్య టీమ్ కు బిగ్ షాక్ తగిలినట్టయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.