Begin typing your search above and press return to search.

రిలీజ్ దగ్గర పడుతున్నా దూకుడు పెంచడం లేదేంటి..?

By:  Tupaki Desk   |   17 Jun 2022 4:30 PM GMT
రిలీజ్ దగ్గర పడుతున్నా దూకుడు పెంచడం లేదేంటి..?
X
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తోఫుల్ జోష్ లో ఉన్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ''థ్యాంక్యూ'' చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడం పై అక్కినేని ఫ్యాన్స్ కలవరపడుతున్నారని తెలుస్తోంది.

విడుదలకు సిద్ధమైన 'థ్యాంక్యూ' సినిమా నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. అదే సమయంలో 'ప్రేమమ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి చిత్రాలను గుర్తు చేస్తోందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ 'మారో మారో' మరియు 'ఏంటో ఏంటేంటో' అనే రెండు పాటలను రిలీజ్ చేశారు కానీ.. హైప్ సృష్టించలేకపోయాయి.

మెలోడియస్‌ గా సాగిన 'ఏంటో ఏంటేంటో' పాట మంచి రెస్పాన్స్‌ ని అందుకుంది కానీ.. ఇది సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ చేసేదైతే కాదు. ‘మనం’ వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత విక్రమ్ కుమార్ - నాగచైతన్య కాంబోలో వస్తోన్న ‘థ్యాంక్యూ’ సినిమా చుట్టూ ఎలాంటి సందడి లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

విక్రమ్ కుమార్ క్లాస్ టచ్ ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్. అతని సినిమాలు ప్రధానంగా యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుంటాయి. ఇప్పటి వరకు మేకర్స్ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ఈరోజుల్లో ఎలాంటి సినిమాకైనా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అనేవి కీలకం. ఎంత గట్టిగా ప్రచారం చేస్తే అంత ఓపెనింగ్స్ అనే విధంగా మారిపోయింది.

అయినప్పటికీ 'థాంక్యూ' మేకర్స్ మాత్రం దూకుడుగా ప్రమోషన్స్ చేయకపోవడం పై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంత మంచి కంటెంట్ అయినా జనాల దృష్టిని ఆకర్షించేస్తే థియేటర్లకు వస్తారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు తన సినిమాలకు డిఫరెంట్ స్ట్రాటజీతో ప్రమోషన్స్ చేస్తుంటారు. మరి ఈ సినిమా విషయంలో ఏవిధంగా ముందుకు వెళ్తారో చూడాలి.

"థ్యాంక్యూ'' చిత్రంలో చైతన్య సరసన రాశీ ఖన్నా - మాళవికా నాయర్ - అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. సుశాంత్ రెడ్డి - ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన ఈ సినిమాకి బీవీఎస్ రవి కథ అందించారు.

మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. లెజండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. 'థ్యాంక్యూ' చిత్రాన్ని 2022 జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.