Begin typing your search above and press return to search.
'మా నాడు' రీమేక్ లో హీరో చైతూ కాదా?
By: Tupaki Desk | 19 July 2022 5:30 PM GMTశింబు హీరోగా నటించిన తమిళ చిత్రం 'మా నాడు'. వెంకట్ ప్రభు సరికొత్త స్క్రీన్ ప్లే తో రూపొందించిన ఈ మూవీ హీరోగా శింబుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. వరుస ఫ్లాపుల్లో వున్న శింబు ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ మూవీని తెలుగులో 'రీవెండ్' పేరుతో రిలీజ్ చేయాలని కొంత మంది ప్రయత్నాలు చేశారు. అయితే ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు సొంతం చేసుకున్నారు.
ఆ తరువాత అనేక వివాదాలు ఈ మూవీని చుట్టుముట్టాయి. డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతుందా? లేక తెలుగులో రీమేక్ చేస్తారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఫైనల్ గా నాగచైతన్య దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చైతో ఈ మూవీని రీమేక్ చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై హీరో నాగచైతన్య స్పష్టతనిచ్చారు. మంగళవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన నాగాచైతన్య 'మా నాడు' రీమేక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తను నటించిన తాజా చిత్రం 'థాంక్యూ'. 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో హీరో నాగచైతన్య ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన చైతూ 'మా నాడు' రీమేక్ పై క్లారిటీ ఇచ్చారు. 'మా నాడు' సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది.
తెలుగు రైట్స్ కోసం ప్రయత్నించాను. అయితే రైట్స్ అమ్మలేమనో ఏదో ఇష్యూస్ వుంటాయని తెలియడంతో రీమేక్ హక్కుల కోసం ట్రై చేయడం ఆపేశాను. 'మా నాడు' ముందు నుంచే వెంకట్ ప్రభు తో ట్రావెల్ అవుతున్నాను. ఇప్పడు తనతో చేస్తున్న సినిమా 'మా నాడు'కు ముందే చెప్పాడు. ఈ మూవీ రైట్స్ కోసం ప్రయత్నించి ఆశ వదిలేసుకున్నాను. అయితే ఇప్పడు దాన్నే రానా చేస్తున్నాడు' అని స్పష్టం చేశాడు.
ఇక 'థాంక్యూ' సినిమా గురించి మాట్లాడుతూ ఈ మూవీ కోసం చాలా వరకు తగ్గాను. దీనికి ముందే 'లాల్ సింగ్ చద్దా' కోసం 25 కేజీలు తగ్గాను. అది ఈ సినిమాకు బాగా ఉపయోగపడిందని తెలిపాడు నాగచైతన్య. థాంక్యూ నాకు ఫిజికల్ గా, మెంటల్ గా ఛాలెంజింగ్ సినిమా. ఇందులో నేను మూడు షేడ్స్ లో వున్నట్టుగా కనిపిస్తాను. కానీ చాలా షేడ్స్ వుంటాయి. 16 ఏళ్లు, 20 ఏళ్లు, 25, 30, 36 ఇలా రక రకాల ఫేజెస్ చూపించాం' అని తెలిపాడు.