Begin typing your search above and press return to search.

సమంత ఫోటోగ్రాఫర్ చించేస్తున్నాడు

By:  Tupaki Desk   |   2 Jun 2017 4:15 AM GMT
సమంత ఫోటోగ్రాఫర్ చించేస్తున్నాడు
X
సౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం బ్యాంకాక్ అంతా తెగ చక్కర్లు కొట్టేస్తోంది. మరి హైద్రాబాద్ లో ఉన్నపుడే ఖాళీ దొరికితే కాబోయే మొగుడు నాగ చైతన్యతో కలిసి కనిపించే ఈ బ్యూటీ.. బ్యాంకాక్ వరకూ ఒక్కతే వెళ్లిపోయిందా అనే డౌట్ వచ్చిందా?

అలాంటివేమీ అక్కర్లేదు.. హాలీడే టూర్ కు సమంతతో పాటు నాగ చైతన్య కూడా వెళ్లాడట. ఇద్దరూ కలిసి బ్యాంకాక్ లో వెకేషన్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో విశేషం తెలుసా? ఇప్పుడు సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ హంగామా చేస్తోంది చూశారూ!!.. ఇవన్నీ స్వయంగా నాగచైతన్య తీసినవేనట. చైతు దగ్గర ఈ రేంజ్ ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయనే విషయం ఇన్నేళ్లలో ఎవరికీ తెలియదు. తన భార్యను మరింత అందంగా కెమేరాలో బంధిస్తున్న చైతు అదరగొట్టేస్తున్నాడని చెప్పచ్చు. సౌత్ మెచ్చిన బ్యూటీ సమంత కం తన వైఫ్‌ ను చాలా అందంగా చూపిస్తున్నాడు.

లోకల్ లో ఉన్నపుడు పలు మార్లు సమంతకు చైతు వంట చేసి పెట్టిన విషయం చూశాం. అది కూడా సమంతే ఇన్ స్టా అకౌంట్ ద్వారా చెప్పింది. చూపించింది కూడా. ఇక్కడున్నపుడు కాబోయే భార్యకు వంట చేసి పెట్టి.. ఇప్పుడు ఫారిన్ వెళ్లాక.. అక్కడ ఫోటోగ్రాఫర్ గా మారిపోయాడు చైతు. 100పర్సెంట్ లవ్ ను సమంతపై చూపిస్తూ.. అచ్చమైన భర్త అనిపించేసుకుంటున్నాడు కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/