Begin typing your search above and press return to search.

'కొత్తదర్శకులు వద్దు సీనియర్లే ముద్దు' అంటున్నాడా.. ఈ హీరో??

By:  Tupaki Desk   |   26 March 2021 12:30 AM GMT
కొత్తదర్శకులు వద్దు సీనియర్లే ముద్దు అంటున్నాడా.. ఈ హీరో??
X
ఈ మధ్యకాలంలో హీరోలు ఏ దర్శకుడితో సినిమాలు చేసినా రిస్క్ అయిపోతుందట. ఎందుకంటే ఓవైపు కొత్తవాళ్లతో చేస్తే తొలిప్రయత్నం ఫలించక ఫెయిల్ అవుతున్నారు. అలాగే సీనియర్ దర్శకులతో చేస్తే సినిమా కథనాలు రొటీన్ అయిపోయి అవికూడా ప్లాప్స్ అవుతున్నాయి. కానీ ఈరోజుల్లో పరిస్థితి ఒకప్పటిలా లేదనేది అందరికి తెలిసిందే. హీరోలు ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలో తెలియక సంధిగ్ధంలో పడుతున్నారు. కానీ అక్కినేని హీరో మాత్రం డైరెక్టర్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్ ఆరంభం నుండి 'లవర్ బాయ్'గా ఫేమ్ తెచ్చుకున్న చైతూ.. ఈమద్యే మజిలీ సినిమాతో ట్రెండ్ మార్చాడు. ఆ సినిమాలో తండ్రిగా కూడా నటించాడు.

అయితే ప్రస్తుతం చైతూ డిఫరెంట్ స్టోరీలతో, నటనకు ఇంపార్టెన్స్ కలిగిన కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. మజిలీ తర్వాత రెండేళ్లు దగ్గరపడినా నాగచైతన్య నుండి ఒక్కసినిమా రాలేదు. భారీ విరామం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే లవ్ స్టోరీ మూవీ సోషల్ మీడియాతో ఇండస్ట్రీ వర్గాలలో మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా చైతూ ఇకపై కొత్త దర్శకులతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడట. నిర్మాతలు ఇప్పుడు చైతూ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ప్లాప్ లలో ఉన్న సీనియర్ డైరెక్టర్ అయినా ఓకే గాని.. నూతన దర్శకులతో సినిమా చేయనని ఖరాఖండిగా చెబుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం థాంక్యూ సినిమాతో పాటు అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' సినిమాకోసం 40రోజుల డేట్స్ ఇచ్చాడట. అయితే వీటితో పాటు బంగార్రాజు, మజిలీ నిర్మాతలతో సినిమాలు లైన్ లో ఉన్నాయట. ఏదైనా సరేగాని అనుభవం కలిగిన దర్శకుడు అయితేనే ఓకే అనేసాడట చైతూ.. చూడాలి మరి ఇకపై కొత్తవాళ్ళతో సినిమాలు చేయదేమో!