Begin typing your search above and press return to search.
నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే పాత్రలో చైతూ..!
By: Tupaki Desk | 5 Feb 2022 10:30 AM GMTయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కెరీర్ ప్రారంభంలో పెద్దగా ప్రయోగాలు చేయకపోయినా, ఇటీవల కాలంగా విభిన్నమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరైన స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నారు. 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు'.. ఇలా వేటికవే ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటూ నాలుగు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో సరికొత్త పాత్రల్లో కనిపించడానికి రెడీ అవుతున్నారు చైతూ.
గతేడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన 'లవ్ స్టోరీ' చిత్రంలో దళిత యువకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు నాగచైతన్య. ఇటీవల తన తండ్రితో కలిసి చేసిన 'బంగార్రాజు' సినిమా ద్వారా అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా పాత్రలను పోషించగలడని నిరూపించారు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న 'థాంక్యూ' మూవీలో చైతూ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు మరో అడుగు ముందుకేసి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యారు.
నాగచైతన్య డిజిటల్ డెబ్యూ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు. దీనికి కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ ఒరిజినల్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి “ధూత” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే టైటిల్ ని బట్టి ఇందులో చైతన్య ఒక మెసెంజర్ గా కనిపిస్తారని అనుకోవచ్చు.
ఆత్మలతో మాట్లాడి మానవులకు సందేశం ఇచ్చే దూతగా కనిపిస్తారని అంటున్నారు. అయితే హారర్ వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు చైతూ ఆ మధ్య ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విక్రమ్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉండటంతో నెగిటివ్ రోల్ అయినా చేయడానికి రెడీ అయినట్లు తెలిపారు.
మంచి స్క్రిప్ట్ దొరికినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో సినిమా చేద్దామని నిర్మాతలను అడగలేనని.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీసులు ఎలాంటి పాత్ర అయినా చేసే అవకాశం అందిస్తోందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. బిగ్ స్క్రీన్ మీద తమకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా మంది యాక్టర్స్ అన్ని రకాల పాత్రల్లో నటించడం లేదని.. కానీ ఇప్పుడు ఓటీటీల వల్ల కుదురుతుందని చెప్పారు. ఇందులో నటించడానికి చైతన్య చాలా ఎగ్జైట్ గా ఉన్నారని తెలుస్తోంది.
ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ లో నాగచైతన్యతో పాటుగా ప్రియా భవానీ శంకర్ కీలక పాత్ర చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో త్వరలో ఈ ఒరిజినల్ షూటింగ్ ప్రారంభం కానుంది. 'మనం' సినిమా కల్ట్ క్లాసిక్ తర్వాత.. చై - విక్రమ్ కలిసి చేస్తున్న 'థాంక్యూ' మరియు వెబ్ సిరీస్ పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. వీటి ద్వారా నటుడిగా చైతన్య తనను సరికొత్తగా ఆవిష్కరిస్తారని నమ్ముతున్నారు.