Begin typing your search above and press return to search.
ఈ అక్కినేని హీరో నెక్స్ట్ మూవీ ఏంటి??
By: Tupaki Desk | 17 April 2021 4:30 PM GMTకోవిడ్ కారణంగా ఇటీవలే విడుదలకు సిద్ధమైన సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డాయి కానీ మళ్లీ రిలీజ్ ఎప్పుడనే విషయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలే కోవిడ్ సెకండ్ వేవ్ అనేది వేగంగా వ్యాప్తి చెండుతోంది. ఇలాంటి తరుణంలో అక్కినేని హీరో నాగచైతన్య తదుపరి సినిమా విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. నిజానికి నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరీ' మూవీ ఆల్రెడీ కరోనా కారణంగానే గతేడాది నుండి ఈ ఏడాదికి వాయిదాపడింది. తీరా ఇప్పుడు విడుదలకు అన్నివిధాలా రెడీ అయిపోయాక కరోనా మళ్లీ వచ్చి వాయిదా పడేలా చేసింది. ఏప్రిల్ 16న సినిమా విడుదలకు రంగం సిద్ధం చేసుకున్నారు మేకర్స్. ఎందుకంటే సినిమా ఎలాగో రిలీజ్ దగ్గరపడింది కదా అని ప్రేక్షకులు ఓ రేంజిలో ఎక్సపెక్ట్ చేశారు.
నాగచైతన్య కెరీర్లో ఈ సినిమా క్రియేట్ చేసినంత బజ్ ఏ సినిమా చేయలేదు. ఇప్పటికి ఇండస్ట్రీ దృష్టి 'లవ్ స్టోరీ' పైనే ఉంది. కానీ ఆ క్రెడిట్ అంతా చైతూ ఒక్కడిదే కాదు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరోయిన్ సాయిపల్లవి సినిమాకు ఆ రేంజిలో బజ్ క్రియేట్ అయ్యేందుకు కారణం అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. లవ్ స్టోరీ సినిమా మే 13న విడుదల కాబోతుందని టాక్. ఒకవేళ రిలీజ్ అయ్యింది అనుకుంటే.. లవ్ స్టోరీ తర్వాత ఈ హీరో ఏ సినిమా చేస్తున్నాడనేది ఇప్పటికి క్లారిటీ లేకుండా పోయింది. కానీ లవ్ స్టోరీ ఫలితం చూసాకే తదుపరి సినిమా చేస్తాడేమో అని కథనాలు వినిపిస్తున్నాయి. ఓవైపు థాంక్యూ మూవీ చేస్తున్నాడని టాక్ అదికూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో చైతూ, వైఫ్ సమంతతో కలిసి మనం సీక్వెల్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాగో ఓన్ బ్యానర్ కాబట్టి అందులోనే నిర్మాణంలో అదృష్టం పరీక్షించుకుంటారేమో చూడాలి!