Begin typing your search above and press return to search.

టీజర్‌ : చిన బంగార్రాజు కూడా సోగ్గాడే

By:  Tupaki Desk   |   23 Nov 2021 5:40 AM GMT
టీజర్‌ : చిన బంగార్రాజు కూడా సోగ్గాడే
X
అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగార్రాజు టీజర్‌ విడుదల అయ్యింది. గత కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలకు.. పుకార్లకు బంగార్రాజు టీజర్‌ చెక్‌ పెట్టినట్లయ్యింది. నాగార్జున మరియు నాగచైతన్యలు ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు అనే విషయమై స్పష్టత వచ్చినట్లుగానే కనిపిస్తుంది. నాగ చైతన్య మరియు నాగార్జునలు ఈ సినిమాలో బంగార్రాజులుగా కనిపించబోతున్నారు. నాగార్జున పెద్ద బంగార్రాజు కాగా.. నాగ చైతన్య చిన బంగార్రాజు గా కనిపించబోతున్నాడు. టీజర్ విడుదల సందర్బంగా మేకర్స్ చిన బంగార్రాజు అంటూ చైతూ పాత్రను సంభోధించడం జరిగింది. కనుక సినిమాలో వీరిద్దరు తాత మనవడుగా కనిపించబోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది.

టీజర్‌ లో నాగ చైతన్య ను చూస్తుంటే సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జునను చూసినట్లుగా ఉంది. చిన బంగార్రాజు కూడా తక్కువేం కాదు.. మాంచి సోగ్గాడే అంటూ ఈ టీజర్ తో క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. నాగార్జున మోస్ట్‌ రొమాంటిక్ గా సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కనిపించాడు. ఇప్పుడు బంగార్రాజులో కూడా చైతూ అంతకు మించి రొమాంటిక్ గా కనిపించబోతున్నట్లుగా టీజర్‌ చెప్పకనే చెబుతోంది. నాగార్జున స్వర్గంలో అప్సరసలతో ఆడి పాడితే భూమి మీద చిన బంగార్రాజు ముద్దుగుమ్మలతో రొమాన్స్ లో మునిగి తేలబోతున్నాడనిపిస్తుంది. మొత్తంగా అక్కినేని నాగ చైతన్య ను చిన బంగార్రాజు గా చూసి అభిమానులు ఖుషీ అయ్యేలా టీజర్‌ ఉంది.

సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసేలా టీజర్‌ ను తీసుకు వచ్చిన మేకర్స్ సినిమా ను ఎలా తెరకెక్కిస్తున్నారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగ చైతన్య మరియు నాగార్జునలు ఇప్పటికే మనం సినిమాలో కలిసి నటించారు. కనుక వీరి కాంబోలో మళ్లీ సినిమా వస్తే సెంటిమెంట్ ప్రకారం విజయం ఖాయం అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఆ విజయం బంగార్రాజు దక్కించుకోబోతున్నాడు. ఈ చిత్రంలో చిన బంగార్రాజు కు జోడీగా ఉప్పెన కృతి శెట్టి నటిస్తున్న విషయం తెల్సిందే.

నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి ఒక రాజకీయ నాయకురాలిగా కనిపించబోతుంది. బంగార్రాజు.. నాగ లక్ష్మిల రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది.. అసలు ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెలా లేదా ప్రీ క్వెలా అనేది అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటికి కూడా జనవరిలో సమాధానాలు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే బంగార్రాజును సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట. నాగార్జున ఈ సినిమాను జీ స్టూడియోస్ వారితో కలిసి కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది.