Begin typing your search above and press return to search.
సమంత అడిగింది.. చైతూ చెప్పాడు
By: Tupaki Desk | 15 Aug 2016 9:30 AM GMTమూణ్నెల్ల ముందు వరకు అక్కినేని నాగచైతన్య.. సమంత రూత్ ప్రభుల మధ్య సోషల్ మీడియాలో ఏదైనా కాన్వర్జేషన్ జరిగితే జనాలు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ ఎక్కడైనా కలిసి కనిపించినా.. సోషల్ మీడియాలో ఏదైనా డిస్కషన్ పెట్టినా కళ్లు విచ్చుకుని చూస్తున్నారు. ఇందుకు కారణం ఏంటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైతూతో తన బంధం గురించి సమంత విడిపించి విడిపించక చెప్పినప్పట్నుంచి.. ఇద్దరి మీద జనాలు డేగ కళ్లు వేసి చూస్తున్నారు. ఇద్దరూ కలిసి ‘అఆ’ సినిమా చూస్తూ.. ఇంకోసారి ఏదో షాపింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కడం తెలిసిందే. అలా చాటుగా కలవడం తప్పితే.. ఇద్దరి మధ్య సోషల్ మీడియా కాన్వర్జేషన్ మాత్రం లేదు గత మూడు నెలల్లో.
ఐతే తాజాగా ట్విట్టర్లో వీళ్లిద్దరి మధ్య ఓ సంభాషణ జరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. నిన్న విక్టరీ వెంకటేష్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన అన్న కొడుకు రానా దగ్గుబాటి.. వెంకీ కెరీర్లో తనకు అత్యంత నచ్చిన సినిమా ‘బొబ్బిలి రాజా’ అని చెప్పాడు. సమంత ట్వీట్ పై స్పందిస్తూ.. చైతూ ఇంతకీ వెంకీ సినిమాల్లో నీ ఫేవరెట్ ఏది అని అడిగింది. దానికి చైతూ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ అని బదులిచ్చాడు. అంతకుమించి ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగలేదు. ఆమాత్రమే అయినా సమంత-చైతూ మధ్య కాన్వర్జేషన్ జనాల్లో బాగానే ఆసక్తి రేకెత్తించింది. ఐతే చైతూ ఆన్సర్ మీద రానా స్పందిస్తూ.. ‘వావ్’ అనడం విశేషం. చైతూ టేస్టు విషయంలో ఇది సెటైరో ఏంటో?