Begin typing your search above and press return to search.

కేతికను చూస్తే ఎవరికైనా రొమాన్స్ చేయాలపిస్తుంది!

By:  Tupaki Desk   |   1 Dec 2021 11:30 PM GMT
కేతికను చూస్తే ఎవరికైనా రొమాన్స్ చేయాలపిస్తుంది!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో నాగశౌర్య ఒకరు. యాక్షన్ హీరోగాను పేరు తెచ్చుకోవడానికి ఆయన కొంతకాలంగా ట్రై చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'లక్ష్య' సినిమాను చేశాడు. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. సాధించవలసిన లక్ష్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై నాగశౌర్య మాట్లాడాడు.

"ఈ సినిమా బయటికి ఎప్పుడు వస్తుందా అని నేను ఏడాదిన్నరగా వెయిట్ చేస్తున్నాను. రెండేళ్ల క్రితం నేను ఈ కథను విన్నాను. సంతోష్ వచ్చి ఇంటర్వెల్ వరకూ నడిచే కథనే నాకు మూడున్నర గంటలు చెప్పాడు. సెకండాఫ్ రేపు వింటానండి ఏమీ అనుకోవద్దు అని చెప్పాను. అంటే ఆ కథను నాకు అంత వివరంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. బాణం ఎలా పట్టుకోవాలి? ఎలా వదలాలి? ఎందుకని అలా చేస్తారు? అనేది పూసగుచ్చినట్టుగా చెప్పాడు. సెకండాఫ్ విన్న తరువాత ఈ సినిమా చేయాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి అనుకున్నాను.

సెకండాఫ్ వినగానే నేను ఓకే చెప్పేయడం జరిగింది. నిర్మాతలు ముగ్గురూ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టారు. ఈ సినిమా నా డ్రీమ్ అని చెప్పేసి ఒక చిన్న పిల్లాడిలా వాళ్ల వెంట పడేవాడిని. అలా వాళ్లని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ చెబుతున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ .. నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఆర్ ఆర్ కూడా అదరగొట్టేశాడు. ఎప్పటి నుంచో మేమిద్దరం కలిసి పనిచేయాలనుకుంటున్నాము .. అది ఇప్పటికి కుదిరింది. కేతిక 'రొమాంటిక్' సినిమాతో వచ్చింది. నిజంగానే ఆ అమ్మాయిని చూస్తే ఎవరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుంది.

అతి తక్కువమంది ఉంటారు .. ఇండస్ట్రీకి రాగానే గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు. అలాంటి గుర్తింపు ఆమెకి దక్కింది. మా కెమెరామెన్ రామ్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. ఈ గేమ్ అందరికీ అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టమైన విషయం.
డైలాగ్ రైటర్ మణిగారు చాలా బాగా రాశారు. ఎక్కడైనా నచ్చలేదని చెబితే ఫీల్ అవకుండా మార్చేవారు. ఈ సినిమాలో జగపతిబాబుగారు .. సచిన్ ఖేడ్కర్ మేజర్ రోల్స్ ను చేశారు. నాతో పాటు ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాను మోశారు. వాళ్లిద్దరికీ కూడా నేను హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అంటూ ముగించారు.