Begin typing your search above and press return to search.
మెగాస్టార్‌ని అంత మాటన్నాడని...
By: Tupaki Desk | 26 Jun 2015 1:30 PM GMTవేరే భాషల్లో హీరోలతో పోలిస్తే తెలుగు సినిమా హీరోలు చాలా అదృష్టవంతులు. అసలు తెలుగోడి అభిమానానికి హద్దులే లేవు. ఎవరైనా హీరోని ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడడు. వేరే భాషల్లో హీరోలకు ఇంత సీనేలేదు. అందుకే మన హీరోల్ని అదృష్టవంతులు అనాల్సొచ్చింది.
అయితే ఈ మాటని మనం అనడం కాదు. పొరుగు భాషల్లో హీరోలైన సూర్య, కార్తీ, సుదీప్ లాంటి హీరోలే చెబుతుంటారు. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రతిసారీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. ఇక్కడ స్టార్లను అభిమానించినట్టు వేరే ఎక్కడా అభిమానించరు అని సర్టిఫికెట్ ఇచ్చి మరీ వెళ్తుంటారు. అయితే దీనినే మనవాళ్లు పిచ్చి ప్రేమ అని కొట్టి పారేస్తుంటారు. ఒక అభిమాని వేరే హీరో అభిమానులతో గొడవపడడం, దూషించడం లాంటి సంఘటనలు రెగ్యులర్‌గా ఇక్కడ జరుగుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ప్రతిఘటన లేటెస్టుగా ఓ కుర్రహీరోకి ఎదురైంది.
టాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ నాగశౌర్య నిన్నటి రోజున ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ ముచ్చట్లలో అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానమిచ్చాడు. అయితే ఇందులో మెగాస్టార్ గురించి మీ అభిప్రాయం చెప్పండి.. అంటూ ఓ అభిమాని ప్రశ్నించారు. 'నంబర్ వన్ ఇన్ టాలీవుడ్.. నో మ్యాటర్ వాట్' అని జవాబిచ్చాడు నాగశౌర్య. దాంతో పెద్ద రచ్చే మొదలైంది. ఆ తరువాత జరిగిన మాటల ముష్టియుద్దం గురించి మనం చెప్పుకోవక్కర్లేదు.