Begin typing your search above and press return to search.
మాస్‌రాజా అయిపోతామంటే ఎటా???
By: Tupaki Desk | 30 Jun 2015 5:30 PM GMTమాస్‌లో బాస్‌లైతే కలెక్షన్ల సునామీ సాధ్యం. అందుకే ఇప్పుడొస్తున్న హీరోలంతా మాస్‌ని ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేస్తున్నారు. కొందరైతే తొలి సినిమాతోనే మాస్ హీరోలు అయిపోవాలని కలలుగంటున్నారు. అయితే ఇలా వచ్చినవాళ్లంతా 'మాస్ అప్పీల్' లేక చతికిలబడిపోతున్నారు. ఈ వరుసలో కొన్ని పేర్లు వెతికితే.. నాగచైతన్య, నాగశౌర్య ఈ తరహా ప్రయత్నాలు చేసినవారిలో ఉన్నారు. మధ్యలో తనీష్, నవదీప్, గౌతమ్ (బ్రహ్మానందం తనయుడు) లాంటి హీరోలు ప్రయత్నించినా అవన్నీ వృధా ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి.
ఇప్పటికి రేసులో ఉన్న చైతన్య, నాగశౌర్య కెరీర్‌ని పరిశీలిస్తే.. చైతూ తన లుక్స్ ప్రకారం చాక్లెట్‌బోయ్, లవర్ బోయ్ క్యారెక్టర్లకు మాత్రమే సూటబుల్. కానీ మధ్యలో దడ, ఆటోనగర్ సూర్య, దోచెయ్ లాంటి సినిమాలతో యాక్షన్‌ని ట్రై చేశాడు. కానీ ఫలితం పూర్తి నెగెటివ్‌గా వచ్చింది. చైతూని యాక్షన్ హీరోగా చూడడానికి కామన్ జనం సహా అతడి అభిమానులు కూడా ఇష్టపడలేదు. మళ్లీ యథావిధిగా లవర్‌బోయ్ తరహా క్యారెక్టర్లలో నటించిన మనం, ఒక లైలా కోసం హిట్టయ్యాయి. ఇప్పుడు సేమ్ ఫలితం నాగశౌర్య విషయంలోనూ రిపీటైంది.
నాగశౌర్య కేవలం 14 నెలల కాలంలో ఐదారు సినిమాల్లో నటించేశాడు. అతడు నటించిన ఊహలు గుసగుసలాడే పెద్ద విజయం సాధించడమే గాక లవర్‌బోయ్ ఇమేజ్ తెచ్చింది. ఆ తర్వాత అదే తరహా చిత్రాల్లో నటించి మెప్పు పొందాడు. కానీ ఇటీవలే జాదూగాడు చిత్రంలో యాక్షన్ హీరోగా కనిపించి అబాసుపాలయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ఫ్లాపైంది. ఈ ఫలితాల్ని బట్టి తమ శరీరభాషకు సరిపడే కథాంశాల్ని ఎంచుకుని నటిస్తేనే ప్రేక్షకుల ఆదరణ దక్కుతోందన్న నిజాన్ని ఈ హీరోలు గ్రహించాల్సిందే.