Begin typing your search above and press return to search.
సైలెంటుగా కొట్టేశాడే హిట్
By: Tupaki Desk | 7 Feb 2018 5:02 AM GMT‘చందమామ కథలు’ సినిమాతో నటుడిగా.. ‘ఊహలు గుసగుసలాడే’తో హీరోగా పరిచయమయ్యాడు నాగశౌర్య. ఆ రెండు సినిమాలూ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇవి కాక శౌర్య కెరీర్లో మరికొన్ని మంచి సినిమాలున్నాయి. కానీ ఇప్పటిదాకా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయితే లేదు. ఆ లోటును ‘ఛలో’ తీర్చేసినట్లే ఉంది. ఈ చిత్రం అంచనాల్ని మించి పెద్ద విజయమే సాధించేలా కనిపిస్తోంది. రూ.6 కోట్లకు బిజినెస్ చేసిన ‘ఛలో’ వారం తిరక్కముందే బయ్యర్ల పెట్టుబడిని వెనక్కి తెచ్చేయడం విశేషం. వీకెండ్లోనే రూ.5 కోట్ల దాకా షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం.. ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ మార్కును కూడా దాటేసింది.
ముఖ్యంగా అమెరికాలో ‘ఛలో’ సంచలన వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రం అక్కడ ఫస్ట్ వీకెండ్లోనే హాఫ్ మిలియన్ మార్కును దాటేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నాగశౌర్యకు సోలో హీరోగా అక్కడ పెద్దగా మార్కెట్టే లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ స్థాయిలో వసూళ్లు ఉంటాయని ఎవ్వరూ అనుకోలేదు. వీకెండ్ తర్వాత కూడా ‘ఛలో’ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ముందు వారం వచ్చిన ‘భాగమతి’ జోరు తగ్గిపోవడం.. ఈ వారం పోటీగా వచ్చిన ‘టచ్ చేసి చూడు’ పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం ‘ఛలో’కు బాగా కలిసొచ్చింది. కొత్త దర్శకుడితో సినిమా చేస్తూ.. అందులోనూ సొంత బేనర్లో తన రేంజికి మించి ఖర్చు పెట్టి సినిమా చేయడం ద్వారా నాగశౌర్య పెద్ద రిస్క్ చేస్తున్నాడని అంతా అనుకున్నారు కానీ.. శౌర్య మంచి జడ్జిమెంట్.. పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగాడని అర్థమవుతోంది. మొత్తానికి శౌర్య సైలెంటుగా వచ్చి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టు కొట్టేశాడు.