Begin typing your search above and press return to search.

2024 వ‌ర‌కూ ఆ యంగ్ హీరో చిక్క‌డు దొర‌క‌డు

By:  Tupaki Desk   |   13 Oct 2020 3:30 AM GMT
2024 వ‌ర‌కూ ఆ యంగ్ హీరో చిక్క‌డు దొర‌క‌డు
X
కోవిడ్ క‌ల్లోలం కొన‌సాగుతున్నా.. అన్ లాక్ ప్ర‌క్రియ ఆగ‌లేదు. ఏడు నెల‌ల త‌రువాత టాలీవుడ్ లో తిరిగి నెమ్మ‌దిగా సంద‌డి మొద‌లైంది. పెద్ద చిత్రాల‌తో పాటు మీడియం బ‌డ్జెట్ చిత్రాల హంగామా కూడా మొద‌లైంది. దీంతో యంగ్ హీరో నాగ‌శౌర్య త‌న కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్టేశాడు. సితార ఎంట‌ర్ టైన్ ‌మెంట్స్ బ్యాన‌ర్ ‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల `అశ్వ‌ద్ధామ‌` చిత్నాన్ని సొంత నిర్మాణ సంస్థ‌లో చేసిన నాగ‌శౌర్య ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు.

ఎంత బిజీగా అంటే రానున్న మూడేళ్ల వ‌ర‌కు అత‌ని డైరీ ఫుల్ అయ అయిపోయింది. అత‌ని లైన‌ప్ చూస్తుంటే అలాగే క‌నిపిస్తోంది. సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ డ్రామ‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏషియ‌న్ ఫిలింస్ నారాయ‌ణ్ దాస్ నారంగ్- పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు నిర్మిస్తున్నారు. దీనితో పాటు స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్ నిర్మించ‌బోతోంది.

ఈ మూవీ విజ‌య‌ద‌శ‌మి రోజున లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్ర‌ వ‌చ్చే ఏడాది మొద‌ల‌వుతుంది. దీనికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించ‌బోతున్నాడు. ఇక ఇటీవ‌లే మ‌హిళ ద‌ర్శ‌కురాలిని ప‌రిచ‌యం చేస్తూ ఓ మూవీ ని నాగ‌శౌర్య మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మూడేళ్ల పాటే ఈ మూడు చిత్రాల‌తో నాగ‌శౌర్య బిజీబిజీగా గ‌డ‌ప‌బోతున్నాడు.