Begin typing your search above and press return to search.
నాగశౌర్య సినిమా.. రిస్క్ చేయాల్సిందే?
By: Tupaki Desk | 19 Jun 2022 2:30 PM GMTకరోనా పరిస్థితుల కారణంగా ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు వరుసగా వాయిదాల పర్వం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినప్పటికీ కూడా సరైన రిలీజ్ డేట్ దొరకడం అంటే ఇప్పుడు అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం విడుదలకు నోచుకోని చాలా సినిమాలు కూడా ల్యాబ్స్ లో అలాగే పడి ఉన్నాయి. అలాగే జనాలు థియేటర్స్ కు రావడం కూడా చాలా వరకు తగ్గిపోయింది. దీంతో కొన్ని ఓటీటీ ఆఫర్స్ కు తలొగ్గక తప్పడంలేదు.
అయితే చాలా కాలంగా విడుదలకు నోచుకోని సినిమాలలో యువ హీరో నాగశౌర్య సినిమా కూడా ఉంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కృష్ణ వ్రింద విహారి సినిమా మొదటి టీజర్ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను అప్పుడెప్పుడో ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ టీజర్ తప్పితే ఇంతవరకు అప్డేట్ లేదు.
ప్రస్తుతం కూడా మరికొన్ని సినిమాలు రాబోయే రోజుల్లో సందడి చేస్తున్నాయి. ఆమధ్య కేజీఎఫ్ 2 రిలీజ్ సమయంలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ పోటీ తీవ్రత మరీ ఎక్కువైంది అని కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. ఆగస్టు వరకు కూడా సినిమాల సందడి మరీ ఎక్కువ కానుంది. జూలైలో పక్కా కమర్షియల్, థాంక్ యు, ది వారియర్, హ్యాపీ బర్త్ డే, కార్తికేయ 2, విక్రాంత్ రోనా, హిట్ 2 సెకండ్ కేస్ ఇలా వరసగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో కృష్ణ వ్రింద విహారికి సరైన స్లాట్ అయితే దొరకడం లేదు.
ఆగస్ట్ లో కూడా పోటీ ఎక్కువగానే ఉంది. బింబిసార, సీతారామమ్, కోబ్రా, యశోద, మాచర్ల నియోజకవర్గం, లాఠీ, స్వాతిముత్యం, లైగర్ ఇలా వరుసగా విభిన్నమైన సినిమాలు రానున్నాయి. కేవలం ఆగస్ట్ మూడో వారం మాత్రమే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది కాబట్టి ఆ డేట్ కు ప్రమోట్ చేసుకొని విడుదల చేసుకుంటే బెటర్. లేదంటే మిగతా సినిమాలను పోటీగా చేసుకొని భరిలోకి దిగాల్సిందే.