Begin typing your search above and press return to search.

నాగ శౌర్య కి అర్జెంట్ హిట్ కావాల్సిందే..!

By:  Tupaki Desk   |   11 May 2023 3:06 PM GMT
నాగ శౌర్య కి అర్జెంట్ హిట్ కావాల్సిందే..!
X
యువ హీరో నాగ శౌర్య కి ప్రస్తుతం బ్యాడ్ లక్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రతిభ ఉన్నా సరే సరైన సినిమా పడక సతమతమవుతున్నాడు ఈ యంగ్ హీరో. సినిమాలు వరుసగా చేస్తున్నా రిజల్ట్ మాత్రం సక్సెస్ అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు.

రీసెంట్ గా వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా నిరాశపరచింది. ఈ సినిమా విషయంలో నాగ శౌర్య చాలా నమ్మకంగా ఉన్నా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం నారి నారి నడుమ మురారి పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలతో అయినా నాగ శౌర్య హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. యువ హీరోల్లో సక్సెస్ విషయంలో వెనకబడి ఉన్నాడు నాగ శౌర్య. ఒకటి రెండు బయట సినిమాలు చేస్తూ ఒకటి సొంత బ్యానర్ సినిమాలు చేస్తున్న నాగ శౌర్య తన సినిమా కథల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడని టాక్. అయితే అది అన్ని సమయాల్లో కలిసి రాదు. నాగ శౌర్య ఖాతాలో అర్జెంట్ గా హిట్ పడాల్సిందే లేకపోతే అతని మార్కెట్ దెబ్బ తినే అవకాశం ఉంది.

వరుసగా హిట్లు పడితే థియేట్రికల్ బిజినెస్ తో పాటుగా డిజిటల్ శాటిలైట్ రైట్స్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. నాగ శౌర్య వరుస ఫ్లాపులు ఇప్పటికే అతని సినిమాల బిజినెస్ విషయంలో దెబ్బ పడుతుంది. రాబోయే సినిమాలు కనుక సక్సెస్ అవ్వకపోతే మాత్రం కెరీర్ రిస్క్ లో పడే అవకాశం ఉంది. సినిమాకు తను పడే కష్టం కనిపిస్తున్నా అతని కథలు రెగ్యులర్ గా అనిపించడం.. సినిమాల మీద ఆసక్తి కలిగించలేకపోతున్నాయి.

మరి ఇక మీదట నాగ శౌర్య హిట్ టార్గెట్ తో.. సరైన కథలు ఎంపిక చేసుకుంటే బెటర్ అని అంటున్నారు. క్లాస్ మాస్ ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే యువ హీరోకి పెద్దగా టైం కలిసి రావట్లేదు. సెట్స్ మీద ఉన్న సినిమాలు తన ఫేట్ మార్చేస్తాయేమో చూడాలి.