Begin typing your search above and press return to search.

నా స్నేహితుడి సోద‌రి జీవిత క‌థ ఇది!- శౌర్య‌

By:  Tupaki Desk   |   26 Jan 2020 4:58 AM GMT
నా స్నేహితుడి సోద‌రి జీవిత క‌థ ఇది!- శౌర్య‌
X
న‌ర్త‌న‌శాల లాంటి ఫ్లాప్ త‌ర్వాత మ‌రో ప్ర‌యోగం చేస్తున్నాడు నాగ‌శౌర్య‌. అశ్వ‌థ్థామ అనేది టైటిల్. మెహ్రీన్ ఫీర్జ‌దా క‌థానాయిక‌. ఒక త‌ల్లి .. చెల్లి.. కుటుంబాన్ని ర‌క్షించుకునే కుర్రాడి క‌థ ఇది అని తొలి నుంచి ప్ర‌చారం సాగుతోంది. ఒక ఘ‌ట‌న దాని చుట్టూ ప‌రిణామాల క్ర‌మంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే స్క్రీన్ ప్లేతో తెర‌కెక్కిస్తున్నామ‌ని ప్ర‌తిసారీ నాగ‌శౌర్య చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే ఇంత‌కుముందు రిలీజైన విజువ‌ల్స్ ఆస‌క్తిని పెంచాయి. శౌర్య కండ‌లు పెంచి 6 ప్యాక్ లుక్ లో క‌నిపించ‌డ‌మే గాక పూర్తిగా త‌న ఇమేజ్ కి భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. భారీ యాక్ష‌న్ థ్రిల్స్ కి స్కోప్ ఉన్న క‌థ‌నే ఎంచుకున్నాడు శౌర్య‌.

అశ్వథ్థామ ఖ‌మ్మం ఆడియో లాంచ్ లో ఈ విష‌యాన్ని మ‌రోసారి క‌న్ఫామ్ చేశాడు శౌర్య‌. ఈ చిత్ర కథకు నిజమైన ప్రేరణ నా స్నేహితుడి సోద‌రి అని తెలిపాడు శౌర్య‌. ``అశ్వథామ ఒక‌ సోదరిని.. ఒక మాతృమూర్తిని కాపాడే ప్రేమికుడి క‌థ‌. నా స్నేహితుడి సోదరి విష‌యంలో జ‌రిగిన నిజ ఘటన ఈ కథను రాయ‌డానికి నన్ను ప్రేరేపించింది`` అని తెలిపాడు. తన తాత గుండెపోటుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నాగ శౌర్య .. చిత్ర క‌థానాయిక మెహ్రీన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు మెహ్రీన్ సైతం ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. అశ్వథామ తన హృదయానికి దగ్గరగా ఉండే క‌థ అని తెలిపారు. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు తక్షణమే కనెక్ట్ అయ్యాను. ప్రతి వ్యక్తిలో అశ్వథ్థామ ఉంటాడు. హిడెన్ గా ఉంటాడు. ఇది మ‌నమంతా నిజంగా తెలుసుకోవాలి. మన జీవితంలో అశ్వథామ అవ్వాలి. సంఘంలో తప్పు జరగకుండా చూసుకోవాలి`` అంటూ మెహ్రీన్ ఉద్వేగానికి గుర‌య్యారు. రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 31 న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది.