Begin typing your search above and press return to search.
నాగశౌర్య బాగా హర్ట్ అయినట్టున్నారే?
By: Tupaki Desk | 8 July 2023 4:39 PM GMT'రంగబలి'ని సినిమా విషయం లో హీరో నాగశౌర్య ఫీలైనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన సక్సెస్ మీట్ లో మాట్లాడిన విధానం, చెప్పిన సమాధానాలు, పలికించిన హావభావాలు గమనిస్తే.. ఇదే అర్థమవుతోంది. మొత్తంగా ఈ సినిమా విషయంలో వచ్చిన టాక్, రివ్యూలు.. కలిసి శౌర్యను కాస్త బాధపెట్టినట్లు అనిపిస్తోంది. ఇదంతా వీడియో లో రికార్డైంది.
'మీడియా పై సెటైర్ వేయాల ని ఎందుకు అనిపించింది?' అని అడగగా.. "మీడియా మేమూ ఒకటే ఫ్యామిలీ. అదే మీడియా వాళ్లు, చంద్రబాబునాయుడు, కేసీఆర్ డూప్‌ల ను పెట్టి వీడియోలు చేసి చూపిస్తారు. మేము మా సినిమా ప్రమోషన్స్ కోసం కాస్త అందరికి తెలిసిన ముఖాల ను ఉపయోగించుకున్నాం. ఒక హీరోను వాళ్లు తమదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందా? అని సరదాగా చేశాం. మేము ఎవరి నీ ఎగతాళి చేయలేదు. మా వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి. వారి మనోభావాలు దెబ్బతీయాల ని మాత్రం అస్సలు చేయలేదు. ఫలానా వారు హర్ట్ అయ్యారంటూ కొంతమంది ప్రచారం చేయడం వల్లే ఆ వార్త ట్రెండ్ అయింది" అని నాగశౌర్య చెప్పారు.
రంగబలి సినిమా లో ఫస్టాఫ్ ను హిలేరియస్ గా చెప్పి, సెకండాఫ్ లో కథ పై ఫోకస్ పెట్టేసరికి చాలామందికి నచ్చలేదనే విషయాన్ని డైరెక్టర్ అంగీకరించాడు. అలాగే ఫస్టాఫ్ లో కథ ను హిలేరియస్‌గా చెప్పి.. సెకండాఫ్ సీరియస్ గా ఉందన్న రివ్యూను శౌర్య అంగీకరించారు. "ఫస్టాఫ్ లో కామెడీ డోస్ ఎక్కువైపోయింది. కంటెంట్‌తో ముందుకెళ్తే మరీ సాగదీశార ని అంటారు. అందుకే కంటెంట్ ను చూపించాం. అది చాలా మందిక నచ్చలేదు. కానీ మేం ఇక్కడున్నది నవ్వించడానికి కాదు. కంటెంట్ చెప్పాలనుకున్నాం. నవ్వుల కోసమే అయితే, మా దగ్గర చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఏదో ఒక మంచి కథతో రావాలన్నది మా ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకూ చాలా మంది హీరోలు ఇలాగే వచ్చారు."అని చెప్పుకొచ్చారు.
అయితే ఇదంతా మాట్లాడేటప్పుడు ఆయన విధానం చూస్తే..కాస్త గట్టిగానే మాట్లాడినట్టు అనిపించింది. ఎక్కడా తడబడకుండా, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే.. కొన్ని చోట్ల శౌర్య సమాధానాల కు.. మీడియా నుంచి ఎదురు ప్రశ్నలు కూడా రాలేకపోయాయి. ఆయన హర్ట్ అయినట్లు కూడా కనిపించింది. ఇంటర్వ్యూ పూర్తవ్వగానే చివర్లో లేచి స్పీడు గా వెళ్లిపోవడం కూడా కనిపించింది.
ఇకపోతే ఈ రంగబలి కి ఈ వీకెండ్ చాలా కీలకం కానుంది. ఈ శని ఆదివారాలు వీలైనంత వసూళ్లు చేస్తేనే బ్రేక్ ఈవెన్ కు దగ్గరవుతుంది. వచ్చే వారం మంచి బజ్‌తో బేబీ చిత్రం రిలీజ్ ఉంది. అలాగే మహావీరుడు, నాయకుడు చిత్రాలు కూడా వస్తున్నాయి. మిషన్ ఇంపాజిబుల్ రానుంది. కాబట్టి వీటిన్నింటినీ దాటి రావాలంటే కాస్త కష్టమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.