Begin typing your search above and press return to search.

ఎట్ ఎందుకో నాగ శౌర్య చెప్పాడు!

By:  Tupaki Desk   |   29 Aug 2018 6:58 AM GMT
ఎట్ ఎందుకో నాగ శౌర్య చెప్పాడు!
X
ఆపాత మధురాలైన తెలుగు సినిమాల టైటిల్స్ ను కొత్త సినిమాలకు ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా క్లాసిక్ టైటిల్స్ అలా వాడారు. రేపు గురువారం నాడు రిలీజ్ కానున్న నాగశౌర్య తాజా చిత్రానికి కూడా అలాంటి టైటిలే పెట్టారు. కాకపోతే ముందు '@' అనే సింబల్ తగిలించారు. మొదట్లో సినిమా లాంచ్ అయినప్పుడు సినిమా టైటిల్ 'నర్తనశాల' మాత్రమే..ముందు ఈ @ లేదు. మరి ఇప్పుడు ఎలా ఎట్ వచ్చింది?

ఈ విషయం గురించి నాగశౌర్య మాట్లాడుతూ తాము నెగెటివ్ సెంటిమెంట్ ను తప్పించుకునేందుకు అలా టైటిల్ ముందు @ అనే సింబల్ ను పెట్టామని చెప్పాడు. పెద్ద ఎన్టీఆర్ 'నర్తనశాల' తప్ప ఆ టైటిల్ తో స్టార్ట్ అయిన కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. నందమూరి బాలకృష్ణ ప్లాన్ చేసిన 'నర్తనశాల' కూడా అలా ఆగిపోయిందని.. ఈ విషయాన్ని తన తండ్రి గుర్తు చేయడంతో ఆ నెగెటివ్ సెంటిమెంట్ కు భయపడి ఆ టైటిల్ కి ముందుగా @ ను పెట్టామన్నాడు.

ఈ సినిమాలో తనది గే పాత్ర కాబట్టి 'నర్తనశాల' టైటిల్ పెట్టామని - అది తప్ప పాత క్లాసిక్ కు తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఒక గే ను ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా స్టొరీలైన్ అని చెప్పాడు. దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి డిఫరెంట్ పాయింట్ మాత్రమే కాకుండా మంచి కథనంతో సినిమాను నడిపించాడని అతనికి ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాడు.