Begin typing your search above and press return to search.
‘జ్యో అచ్యుతానంద’ను రీమేక్ చేయొద్దు
By: Tupaki Desk | 22 Aug 2016 6:22 AM GMTజ్యో అచ్యుతానంద సినిమాను రీమేక్ చేయొద్దని తేల్చి చెప్పాడు నాగశౌర్య. విడుదలకు ముందే ఈ సినిమాకు బాలీవుడ్ తో పాటు ఇంకొన్ని పరిశ్రమల నుంచి రీమేక్ ఆఫర్లు వచ్చాయని.. ఐతే అలాంటి ప్రయత్నాలేమైనా ఉంటే మానుకోవాలని నాగశౌర్య అన్నాడు. ఇంతకీ అతనిలా అనడానికి కారణమేంటంటే.. వేరే భాషల్లో ఏ హీరోలు చేసినా తాను.. రోహిత్ కలిసి పండించిన కెమిస్ట్రీ పండించలేరని.. కాబట్టి రీమేక్ ప్రయత్నాలు మానుకోవాలని అతనన్నాడు. ‘జ్యో అచ్యుతానంద’ ఆడియో వేడుకలో చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ నాగశౌర్య ఇంకా ఏమన్నాడంటే..
‘‘నాకు.. రోహిత్ కు జోడీ అద్భుతంగా కుదిరింది. మా కెమిస్ట్రీ అదిరిపోయింది. నాకీ సినిమాతో రోహిత్ రూపంలో ఓ బ్రదర్ దొరికాడు. మమ్మల్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. అందుకే రీమేక్ ప్రయత్నాలుంటే మానుకోవాలంటున్నాను. నా ప్రతి సినిమాకూ గొప్ప వ్యక్తుల్ని కలుస్తున్నా. ‘ఊహలు గుసగుసలాడే’తో అవసరాల శ్రీనివాస్ ను.. సాయి కొర్రపాటి గారిని కలిశాను. వాళ్ల వల్లే నా జీవితం మొదలైంది. నా తల్లిదండ్రుల తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తి సాయి గారే. ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నా. మామూలుగా ఆడియో వేడుకలు జరిగితే నేను సీట్లో కూర్చోను. వెనకెక్కడో నిలబడతాను. అది సాయి గారిని చూసి నేర్చుకున్నదే. ఈసారేదో నారా రోహిత్ కూడా ఉన్నాడని అతడి పక్కన కూర్చున్నా. ఇంకా సాయి గారిని చూసి చాలా నేర్చుకున్నా. సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా నవ్వుతూనే ఉండాలని.. ఒకేలా స్పందించాలని ఆయన్ని చూసే నేర్చుకున్నా. ‘జ్యో అచ్యుతానంద’ గొప్ప సినిమా అవుతుంది’’ అని శౌర్య అన్నాడు.