Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో మెగా సక్సెస్ అయిందట

By:  Tupaki Desk   |   27 Jan 2018 12:38 PM IST
మెగాస్టార్ తో మెగా సక్సెస్ అయిందట
X
ఊహలు గుసాగుసలాడే అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మన నాగ శౌర్యా. తరువాత దిక్కులు చూడకు రామయ్య - లక్ష్మీ రావే మా ఇంటికి - కల్యాణ వైభోగమే జ్యో అచ్యుతనంద లాంటి మంచి సినిమాలతో మనల్ని మెప్పించాడు. ఒక మనసు తో మనల్ని కన్నీళ్లు పెట్టించి ఇపుడు "చలో" అంటూ మనల్ని నవ్వించడానికి రాబోతున్నాడు.

చలో సినిమా మొదలు అయినపుడు పెద్దగా హైప్ లేకపోయినా టీజర్ మరియు ట్రైలర్ చూశాక అంచనాలు పెరిగిపోయాయి అనటం లో ఏమాత్రం అబద్దం లేదు. ఈ మధ్యనే జరిగిన చలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి రావడం విశేషం. అపుడు స్టేజి పైన దిగిన ఫోటో ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన సంతోషాన్ని మనతో పంచుకున్నాడు శౌర్యా. "మీకు కృతజ్ఞతలు చెప్పడానికి కూడా మాట్లాడలేనంత ఆనందంగా ఉంది సర్ ఆ క్షణం. ఎన్నో సంవత్సరాలుగా మీరే నాకు ఇన్ స్పిరేషన్. మీరు నా గురించి చెప్పిన మాటలు ఎప్పుడు న మనసులోనే ఉంటాయి. ఫంక్షన్ కు వచ్చినందుకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్యూ సర్. నా ఫాన్స్ మరియు వచ్చిన అందరూ మెగా ఫాన్స్ కు కూడా నా స్పెషల్ థాంక్స్. " అంటూ చెప్పుకొచ్చాడు.

తను మెగాస్టార్ తో దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈవెంట్ మెగా సక్సెస్ అయింది అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. బోలెడు అంచానల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది.