Begin typing your search above and press return to search.
నాగ శౌర్య.. ఇది సరిపోదమ్మా!
By: Tupaki Desk | 4 Sep 2022 2:30 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది యువ హీరోలు ఇంకా నిలదొక్కుకోవడానికి సరైన సినిమాలు పడడం లేదు. కొంత ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ అది ఆ సపోర్ట్ లేకపోతే మాత్రం ఇప్పుడున్న కొందరు హీరోల పరిస్థితి చాలా కష్టమనే చెప్పాలి. ఇక నాగశౌర్య మాత్రం వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పటికీ కూడా అతనికి అవకాశాలు వస్తున్నాయి అంటే బ్యాగ్రౌండ్ లో సొంతంగా ఓన్ ప్రొడక్షన్ ఉండడమే కారణం. తల్లిదండ్రులు మంచి వ్యాపారవేత్తలు కావడంతో మనోడు ఐరా ప్రొడక్షన్ సంస్థను ఫ్లాప్స్ వచ్చినా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు.
అయితే నాగ శౌర్య ఆలోచన విధానంలో మెచ్చుకోదగిన విషయం ఏమిటి అంటే అతను అనుకుంటే మొదటి సినిమానే భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవాడు. కానీ అలా కాకుండా మొదట్లో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్లో నటుడిగా తనను తాను ప్రేక్షకులకు పరిచయం చేసుకున్నాడు. చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే సినిమాలు అతనికి నటుడిగా క్లాస్ పరంగా మంచి గుర్తింపును అందించాయి.
ఇక తర్వాత విభిన్నమైన కొన్ని లవ్ స్టోరీలు చేశాడు కానీ అవి ఏమీ అంతగా వర్కౌట్ కాలేదు. మొదట్లో అవకశాలు లేనప్పుడు సొంత ప్రొడక్షన్ మొధలుపెట్టుకోలేదు కానీ ఇతర నిర్మాతలతో పార్ట్నర్ గా ఉంటూ పైకి తన పేరు కనిపించకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక మొత్తానికి ఛలో సినిమా ద్వారా అతను ట్రాక్ లోకి వచ్చేసాడు. ఆ సినిమా కంటెంట్ నమ్ముకున్న నాగశౌర్య ఐరా ప్రొడక్షన్ సంస్థను మరింత హైలెట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
అయితే 2017 లో వచ్చిన ఛలో సినిమా తప్పితే అతనికి మళ్ళీ మరొక సక్సెస్ పడింది లేదు. ఆ తర్వాత వచ్చిన కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల, అశ్వద్ధామ, వరుడు కావలెను, లక్ష్య సినిమాలు దారుణం దెబ్బ కొట్టాయి. ఇక మధ్యలో ఓ బేబీ సినిమా చేసినప్పటికీ అందులో సపోర్టింగ్ రోల్ వరకే హైలెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు నాగశౌర్య నుంచి కృష్ణ వ్రింద విహారి అనే సినిమా రాబోతోంది. అసలు ఈ సినిమాపై కొంచెం కూడా పాజిటివ్ బజ్ అయితే లేదు.
ఏప్రిల్ 22న విడుదల చేయాలని అనుకుంటున్నారు. రోమాంటిక్ కామెడీ సినిమా గా తెరపైకి రాబోతున్న ఈ సినిమాకు అనిష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇంతవరకు విడుదలైన పాటలకు కూడా పెద్దగా హైప్ వచ్చింది లేదు. బజ్ లేకపోతే పెద్ద సినిమాలను మిడియం బడ్జెట్ సినిమాలనే జనాలు అంతక పట్టించుకోవడం లేదు. ఇక ఇప్పుడు కృష్ణ వ్రింద విహారి మేటర్ లేని కంటెంట్ తో ప్రమోషన్స్ చేస్తే ఎంతవరకు పట్టించుకుంటారు అనేది వారికి తెలియాలి. కానీ నాగశౌర్య మాత్రం ఈ సినిమాపై నమ్మకంతోనే ఉన్నాడు. కామెడీ క్లిక్ అయితే జనాలు రావచ్చు అని అనుకుంటున్నాడు. మరి కృష్ణ వ్రింద విహారి ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.