Begin typing your search above and press return to search.

నేను చెబుతున్నాను .. ఈ సినిమా పక్కా హిట్: నాగశౌర్య

By:  Tupaki Desk   |   28 Oct 2021 3:54 AM GMT
నేను చెబుతున్నాను .. ఈ సినిమా పక్కా హిట్: నాగశౌర్య
X
'వరుడు కావలెను' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి చాలా సందడిగా జరిగింది. ఈ వేదికపై హీరో నాగశౌర్య మాట్లాడుతూ .. "సినిమాను ప్రేమించేవారికీ .. బన్నీని ప్రేమించేవారికి మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. రెండు సంవత్సరాల తరువాత ఇంతమందిని చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. 'వరుడు కావలెను' సినిమా 29న రిలీజ్ అవుతోంది .. మీ అందరికీ తెలుసు. మీకు ఒక మాట చెబుతాను ఈ సినిమా పక్కా హిట్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పడం లేదు. సినిమా చూసి .. నచ్చి .. మీ అందరికీ నచ్చుతుందనే గ్యారెంటీతో చెబుతున్నాను.

డైరెక్టర్ సౌజన్య గారు 14 .. 15 సంవత్సరాలు కష్టపడింది. ఈ 29న తన జీవితం ఏమిటనేది డిసైడవబోతోంది. ఆమె లైఫ్ సెటిలైపోయినట్టేనని అనుకుంటున్నాను. ప్రతి మగాడి విజయానికి వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఆమె వెనుక ఇంతమంది మగాళ్లం ఉన్నాము. ఆమె అనుకున్న జీవితం ఆమెకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీతూ గురించి ఒక విషయం చెప్పాలి. ఫస్టు డే రీతూ శారీలో కారవాన్ లో నుంచి దిగుతుండగా చూశాను. 'మేడమ్ సార్ .. మేడం' అనుకున్నాను. ఆమె లుక్ వెరీ బ్యూటిఫుల్ అని ఆమెతో అప్పుడూ చెప్పాను. అదే మాటను ఇప్పుడూ చెబుతున్నాను.

నదియా గారితో కలిసి నటించడం నా అదృష్టం .. ఆ పాత్రను ఆమె తప్ప అంత బాగా ఎవరూ చేయలేరనిపించింది. అంత మంచి పాత్రను చేశారు. నేను నదియాగారి అభిమానినైపోయాను. సాధారణంగా సినిమాకి రెండు కళ్లు అంటూ ఉంటారు .. కానీ తమన్ - విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి రెండు చెవులు వంటివారు. ఇద్దరూ కూడా అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమాలో నన్ను బాగా కదిలించిన ఒకే ఒక్క క్యారెక్టర్ మురళీ శర్మగారు. 'అల వైకుంఠపురములో' సినిమాలో మురళీశర్మ గారిని చూసిన తరువాత నేను అక్కడ స్ట్రక్ అయ్యాను. ఈ సినిమాలోనూ ఆయన చాలా గొప్ప రోల్ చేశారు. నేను పెళ్లి చేసుకున్న తరువాత నాకే గనుక ఒక కూతురు ఉంటే, ఈ సినిమాలో ఆయనలాగే ఉండాలని నాకు అనిపించింది. అంత గొప్ప క్యారెక్టర్ ఆయనది.

త్రివిక్రమ్ గారిని గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. మాటల మాంత్రికుడు అంటారు ఆయనను.

త్రివిక్రమ్ గారిని గురించి మాట్లాడాలంటే నిజంగా నాకు చాలా భయంగా ఉంది. అయినా ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. ఆయనతో ఒక హీరో సినిమా చేస్తుంటే ఆ హీరోకి హిట్ పడినట్టేనని అభిమానులు అనుకుంటారు. ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం .. ఒక మనిషిని ఏడిపించడం చాలా తేలిక. కానీ ఒక మనిషిని నవ్వించడం చాలా కష్టం. అలాంటిది ఇన్నేళ్లుగా ఆయన కోట్లాదిమంది ప్రేక్షకులను నవ్విస్తున్నారు. అలాంటి ఆయన ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఒకానొక సమయంలో ఈ సినిమాకి ఖర్చు ఎక్కువైపోతుందేమోనని అనిపించింది. కానీ సినిమా చూసిన తరువాత ఎంత ఖర్చు పెట్టినా తీసుకొచ్చే సత్తా ఈ కథకు ఉందనే విషయం అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు.