Begin typing your search above and press return to search.
మరొకటి సరే.. హిట్టొచ్చేదెపుడు శౌర్య!
By: Tupaki Desk | 28 Feb 2020 10:47 AM GMTజయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు నాగశౌర్య. ఇటీవలే అశ్వథ్థామ రిలీజైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేదు. సొంత బ్యానర్ లో తెరకెక్కించిన ఈ సినిమా రిజల్ట్ శౌర్యను ఒక రకంగా నిరాశ పరిచిందనే చెప్పాలి. ప్రస్తుతం వేరే బ్యానర్ సినిమాలకు సంతకాలు చేస్తున్నాడు. ఆ కోవలోనే శౌర్య నటిస్తున్న తాజా సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది.
కె.పి.రాజేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కొనేరు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ నివ్వగా.. కల్యాణ్ రామ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వీఐ ఆనంద్ మొదటి షాట్ కి దర్శకత్వం వహించారు. హరీష్ శంకర్- శరత్ మరార్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ చిత్రానికి `భీష్మ` ఫేం మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. కథానాయికను ఎంపిక చేయాల్సి ఉందింకా.
శౌర్య కెరీర్ ఆరంభం చాక్లెట్ బోయ్ తరహా పాత్రల్లో నటించాడు. లవ్ స్టోరీలతో హిట్లు కొట్టాడు. కెరీర్ మిడిల్ లో కొన్ని ప్రయోగాలు చేసాడు. ఇటీవలే నటించిన అశ్వథ్థామ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్. అయితే ఈసారి అతడు ఎలాంటి వైవిధ్యం చూపిస్తున్నాడు? మార్కెట్ 10 కోట్ల రేంజును అధిగమించాలంటే ఏం చేయబోతున్నాడు? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. కాంపిటీషన్ లో దేవరకొండ .. కార్తికేయ లాంటి హీరోలు దూసుకు పోతున్నారు. మరి శౌర్య ఫ్లాపుల్ని పక్కన పెట్టి స్పీడ్ చూపిస్తాడా లేదా! అన్నది చూడాలి.