Begin typing your search above and press return to search.

ఆ కామెంట్స్ విజయ్ ను ఉద్దేశించి అన్నవి కాదు!

By:  Tupaki Desk   |   29 Aug 2018 8:22 AM GMT
ఆ కామెంట్స్ విజయ్ ను ఉద్దేశించి అన్నవి కాదు!
X

యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం '@నర్తనశాల' గురువారం నాడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాను ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు నాగశౌర్య. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో స్టార్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా స్టార్లు రారని.. రామ్ చరణ్ తోనే అది ఆగిపోయిందని.. అన్నాడు. విజయ్ దేవరకొండ ను స్టార్ అంటున్నారుగా అని అడిగితే "మరి ఫ్లాప్స్ వచ్చినప్పుడు కూడా అలా అనాలి.. అలా స్టార్ అయితే మంచిదే కదా" అన్నాడు.

దీంతో విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి నాగ శౌర్య నెగెటివ్ కామెంట్స్ చేసినట్టుగా కొంతమంది అభిప్రాయపడ్డారు. దీనిపై మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాగ శౌర్య. "స్టార్ ఇమేజ్ అంటే ఒక్క సినిమాతో ఒక్క రోజులో రాదు అన్ని నా ఫీలింగ్. ఎందుకంటే స్టార్ ఇమేజ్ అంటే ఎన్టీఆర్ - మెగాస్టార్ - లాంటి వారిని చూస్తే .. వాళ్ళు ఆ ఇమేజ్ అందుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది .. మనం ఒకటో రెండో సినిమాలు చేసేసి సూపర్ స్టార్స్ అనుకోవడం కరెక్ట్ కాదని నా నమ్మకం. ఉదాహరణకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా 80 కోట్లు వసూలు చేస్తుంది. ఇమేజ్ అంటే అది .. అంతే తప్ప నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఏది అనలేదు. నా వ్యాఖ్యలు విజయ దేవరకొండను ఉద్దేశించి చేసినవి కాదు" అని అన్నాడు.

"మీరు కొత్త దర్శకులతో తరచుగా పనిచేస్తున్నారు.. పైగా వారికి మీర్ హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో అవకాశం ఇస్తున్నారు" అని అడిగితే.. "వాళ్ళు చెప్పే కథలు కొత్తగా ఉంటున్నాయి. వాళ్ళ కథలు నచ్చడంతో మా బ్యానర్ తో తీస్తున్నాం.. అది అలా జరిగిపోతోంది అంతే" అన్నాడు. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో రాజా అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నానని - ఆ సినిమా తర్వాత రమణ తేజ అనే నూతన దర్శకుడితో తమ హోమ్ బ్యానర్ ఐరా లో మరో సినిమాను మొదలుపెడతామని చెప్పాడు. పెళ్లి గురించి అడిగితే "ప్రతి ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. త్వరలోనే ఎవరినో ఒకరిని చూసుకుని చేసుకుంటా" అన్నాడు.