Begin typing your search above and press return to search.
ఆ సినిమా చేశాక పెళ్లి చేసుకోవాలనిపించిందట
By: Tupaki Desk | 6 March 2016 11:30 AM GMTకళ్యాణ వైభోగమే సినిమా చేశాక తనకు పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగిందంటున్నాడు యువ కథానాయకుడు నాగశౌర్య. ‘‘మా డైరెక్టర్ నందిని రెడ్డికి పెళ్లి కాలేదు. ఆమెకు చేసుకునే ఉద్దేశం లేదు. మాటల రచయిత లక్ష్మీభూపాల్ కూడా అంతే. నాకు కూడా ఈ సినిమా చేసే ముందు పెళ్లి మీద వ్యతిరేక అభిప్రాయం ఉండేది. కానీ ఈ సినిమా చేశాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఈ సినిమా మంచి అనుభవం’’ అని చెప్పాడతను. సినిమాలో పెళ్లికొడుకు గెటప్ లో చూసిన వాళ్లంతా పెళ్లెప్పుడు అని అడుగుతున్నారని.. అది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైన ఘట్టం అని.. సినిమాలోలాగే తనకెవరైనా అమ్మాయి నచ్చితే నేరుగా తన తల్లికి పరిచయం చేస్తానని.. ఐతే పెళ్లి కోసం రెండు మూడేళ్లు ఆగమని చెబుతానని శౌర్య అన్నాడు.
‘కళ్యాణ వైభోగమే’ సినిమాకు వస్తున్న స్పందన గురించి మాట్లాడుతూ.. ‘‘కథ చెప్పినప్పుడే నేను ఈ రేంజ్ హిట్ ఊహించాను. కథలో ఉన్న కంటెంట్ అలాంటిది. నందినీ రెడ్డి నాకు స్క్రిప్టు ఎంత బాగా చెప్పారో, అంతకన్నా పది రెట్లు బాగా తీశారు. జనాలున్న థియేటరుకు వెళ్లి ఈ సినిమా చూశాను. ఆడియన్స్ సినిమాలోని కామెడీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. నిజంగా వాళ్ల రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నాడు. ముందీ సినిమాకు టైటిల్ అనుకోలేదని.. షూటింగ్ మధ్యలో ఓ రోజు నందినిని టైటిల్ గురించి అడిగతే.. ‘కళ్యాణ వైభోగమే’ అని చెప్పారని.. ఆ పేరు వినగానే పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని శౌర్య చెప్పాడు. మాళవిక లాంటి డెడికేటెడ్ హీరోయిన్ తో పని చేయడం మంచి అనుభూతి అని.. ఆర్టిస్ట్‌తో పనిచేయడం ఓ మంచి అనుభూతి. అని చెప్పాడు.