Begin typing your search above and press return to search.
షూటింగ్ లో నాగ శౌర్య కాలికి గాయం..
By: Tupaki Desk | 14 Jun 2019 4:45 PM GMTయువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కే మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో రమణ తేజ అనే నూతన దర్శకుడిని నాగ శౌర్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ గత పది రోజులుగా వైజాగ్ లో సాగుతోందని సమాచారం. అయితే ఈరోజు షూటింగ్ లో నాగ శౌర్యకు గాయాలయ్యాయని.. కాలికి ఫ్రాక్చర్ కావడంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారని అంటున్నారు.
'కెజీఎఫ్' సినిమాకు పని చేసిన స్టంట్ మాస్టర్ పర్యవేక్షణలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తుండగా నాగ శౌర్య కాలికి ఫ్రాక్చర్ అయిందని.. దీంతో వైద్యులు 25 - 30 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా శౌర్యకు సూచించారట. దీంతో వైజాగ్ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఆయితే ఈ సంఘటనపై అటు ఫిలిం యూనిట్ మెంబర్స్ కానీ ఇటు నాగ శౌర్య కానీ అధికారికంగా స్పందించలేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం నాగశౌర్య తరఫువారు ఎవరైనా స్పందించాలి.
నాగ శౌర్య ఈ సినిమాలోనే కాకుండా సమంతా కొత్త సినిమా 'ఓ బేబీ' లో కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం జూలై 5 న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా షూట్ ఆల్రెడీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ హోమ్ బ్యానర్ లో తెరకేక్కే సినిమా షూటింగ్ మాత్రం నాగ శౌర్య మళ్ళీ రికవర్ అయిన తర్వాతే ప్రారంభించాల్సి ఉంటుంది.