Begin typing your search above and press return to search.
భలే మంచి ఛాన్స్ 'విహారి' మిస్ చేసుకున్నాడే..!
By: Tupaki Desk | 19 May 2022 12:30 PM GMTకరోనా కారణంగా వాయిదాలు పడ్డ సినిమాలన్నీ కూడా క్యూ కడుతున్నాయి. తెలుగు లో పెద్ద హీరోలు నటించిన సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలు కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్దం అయ్యాయి. ఇలాంటి సమయంలో తెలుగు చిన్న సినిమాలకు రిలీజ్ డేట్ దొరకడం చాలా కష్టంగా మారింది. పెద్ద సినిమాలు లేని వారాల్లో చిన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
ఈ వారంలో శేఖర్ సినిమా కాకుండా పెద్దగా గుర్తింపు ఉన్న సినిమాలు రావడం లేదు. శేఖర్ సినిమాకు కూడా ఆహా ఓహో అన్నంత బజ్ కూడా లేదు. దాంతో ఈ వారంలో మరో రెండు మూడు చిన్న సినిమాల రిలీజ్ కు స్కోప్ ఉంది. అయినా కూడా రెడీగా ఉన్న సినిమాలు విడుదల కాలేదు. ముఖ్యంగా నాగ శౌర్య హీరోగా నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా ను ఈ వారంలో విడుదల చేయాలని భావించి వాయిదా వేశారు.
కృష్ణ వ్రింద విహారి సినిమా ను గత కొన్ని రోజులుగా వాయిదాలు వేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న మే 20న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి ఎలాంటి ప్రకటన లేకుండా వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. రేపు అంటే 20వ తారీకున విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉండేది.. పోటీ లేకుండా వచ్చేది అనేది విశ్లేషకుల అభిప్రాయం.
నాగ శౌర్య కెరీర్ లో అప్ డౌన్స్ ను ఎదుర్కొంటున్నాడు. ఒకటి సక్సెస్ అయితే రెండు మూడు నిరాశ పర్చుతున్నాయి. అయితే ఆయన కథల ఎంపిక విషయంలో మాత్రం మంచి వైవిధ్యంను ప్రదర్శిస్తున్నాడు అంటూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకునే వారు ఒకసారి కాకున్నా ఒకసారి అయినా సక్సెస్ ను దక్కించుకుంటారు.
అందుకే నాగ శౌర్య కూడా కృష్ణ వ్రింద విహారి సినిమా తో సక్సెస్ ను దక్కించుకుంటాడేమో అని ఆయన సన్నిహితులు అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు భావించారు. అందుకే సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు శేఖర్ తప్ప పెద్ద సినిమాలు కాని చిన్న సినిమాలు కాని లేకపోవడంతో ఆ తేదీని నాగ శౌర్య మిస్ చేసుకున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా కు సంబంధించిన ప్రోమోలు మరియు పోస్టర్ లు ఆకట్టుకుంటున్నాయి. అనిల్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా నాగ శౌర్య హోం బ్యానర్ లో రూపొందిన విషయం తెల్సిందే. ఒక మంచి డేట్ లో రావాలని వెయిట్ చేస్తున్న నాగ శౌర్యకు 20వ తేదీ కంటే మంచి తేదీ దొరుకుతుందా అనేది చూడాలి.