Begin typing your search above and press return to search.

నాగశౌర్య.. రాంగ్ టైమింగ్ అబ్బా

By:  Tupaki Desk   |   27 May 2018 10:34 AM GMT
నాగశౌర్య.. రాంగ్ టైమింగ్ అబ్బా
X
నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది ‘ఛలో’ సినిమా. ఒక కొత్త దర్శకుడిని నమ్మకుని సొంత బేనర్లో తన మార్కెట్ స్థాయికి మించి ఎక్కువ ఖర్చుతోనే ఈ సినిమా చేశాడు శౌర్య. ఆ సాహసానికి మంచి ఫలితమే దక్కింది. తొలిసారిగా శౌర్య సినిమా రూ.10 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ జోరులో ఒకట్రెండు మంచి సినిమాలు పడితే శౌర్య రేంజే మారిపోయేది. కానీ ‘ఛలో’ విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఎప్పుడో కమిటైన రెండు సినిమాలు అతడి జోరుకు గండి కొట్టాయి. శౌర్య అయిష్టంగా చేసిన ద్విభాషా చిత్రం ‘కణం’ తీవ్ర నిరాశకు గురి చేసింది. అందులో శౌర్యది సామాన్యమైన పాత్ర. హీరోయిన్ ప్రధానంగా సాగే ఆ సినిమా శౌర్యకు ఏ రకంగానూ కలిసి రాలేదు.

ఇక తాజాగా శౌర్య ‘అమ్మమ్మగారిల్లు’తో పలకరించాడు.‘ఛలో’ సినిమాతో యూత్‌ లో శౌర్యకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఐతే ‘అమ్మమ్మగారిల్లు’ వాళ్ల అభిరుచికి పూర్తి భిన్నమైన సినిమా అయింది. ఈ సినిమా టైటిల్.. ప్రోమోలు యువ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకర్షించలేకపోయాయి. ‘కణం’ కూడా అంతే. మొత్తంగా ఈ రెండు సినిమాలు రాంగ్ టైమింగ్ లో వచ్చి శౌర్య కెరీర్ ను దెబ్బ తీశాయి. ఇవి ‘ఛలో’ కంటే ముందు వచ్చి ఆడకపోయినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ‘ఛలో’తో శౌర్య కెరీర్ మరో స్థాయికి చేరడానికి పునాది పడ్డ తర్వాత ఇవి వచ్చి అతడి ఊపును దెబ్బ తీశాయి. ఈ నేపథ్యంలో ఇక శౌర్య ఆశలన్నీ ‘నర్తనశాల’ మీదే ఉన్నాయి. మరోసారి సొంత బేనర్లో శ్రీనివాస చక్రవర్తి అనే కొత్త దర్శకుడితో ఒక సాహసోపేత కథతో సినిమా చేస్తున్నాడు శౌర్య. మరి ఆ సినిమా అతడికి ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి.