Begin typing your search above and press return to search.
కుర్రహీరో 15 కోట్ల గ్యాంబ్లింగ్
By: Tupaki Desk | 30 Aug 2018 4:08 AM GMTవరుస విజయాలతో స్పీడుమీదున్నాడు నాగశౌర్య. ఛలో - అమ్మమ్మగారిల్లు చిత్రాలు చక్కని విజయాలు సాధించి అతడి కెరీర్‌కి బిగ్ బూస్ట్ నిచ్చాయి. మినిమం 20 కోట్ల గ్రాస్ వసూళ్లను తేగలిగే హీరో గా శౌర్య బిజినెస్ రేంజ్ ఎదిగింది. అందుకే ప్రస్తుతం అతడు నటిస్తున్న `@నర్తనశాల` చిత్రం పై భారీ అంచనాలేర్పడ్డాయి. దేశ - విదేశాల్లో యువహీరోలకు బిజినెస్ అంతకంతకు పెరుగుతోంది. సినిమాలో కంటెంట్ ఉంటే ఆటోమెటిగ్గా అమెరికా నుంచే సినిమా పెట్టుబడులు మొత్తం తిరిగి తెచ్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వసూళ్లు బోనస్‌గా మిగులుతున్నాయి. ఇదో కొత్త ట్రెండ్. బాహుబలి తర్వాత మార్కెట్ విస్త్రతి ఆ స్థాయికి పెరిగిందన్నది ట్రేడ్ చెబుతున్న మాట.
ఈ గురువారం శౌర్య నటించిన @నర్తనశాల ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఆ క్రమంలోనే మార్కెట్ వర్గాల్లో ఒకటే ఆసక్తి. శౌర్య మరోసారి ఛలో అంత పెద్ద హిట్ కొడతాడా? అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి దాదాపు 15కోట్ల మేర థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ సాగింది. అంటే ఆ మేరకు షేర్ వసూళ్లు సాధిస్తేనే హిట్టు కొట్టినట్టు. శౌర్య స్టామినా అంత ఉందా? ఈసారి కూడా ఆ స్థాయి వసూళ్లు అందుకుంటాడా? అంటూ విశ్లేషణలు జోరందుకున్నాయి.
నాగశౌర్య కథానాయకుడిగా, యామిని భాస్కర్ - కశ్మీరా పరదేశి కథానాయికలుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో ఉషా మూల్పురి - ప్రసాద్ మూల్పురి నిర్మించిన చిత్రం నర్తనశాల. శౌర్య సొంత బ్యానర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కింది. పోస్టర్లు - టీజర్లు - ట్రైలర్లతో ఆకట్టుకున్నారు. మరి కాసేపట్లో ప్రివ్యూల నుంచి రిపోర్ట్ అందనుంది. 15 కోట్ల గ్యాంబ్లింగ్‌లో రిటర్న్స్ ఎంత అన్నది హిట్టు టాక్ పై ఆధారపడి ఉంటుంది. జస్ట్ వెయిట్..