Begin typing your search above and press return to search.

ఇటలీలో నర్తనశాల

By:  Tupaki Desk   |   21 Jun 2018 12:37 PM IST
ఇటలీలో నర్తనశాల
X
ఛలో సక్సెస్ తో మంచి ఊపుమీదున్న నాగ శౌర్య కొత్త సినిమా @నర్తనశాల షూటింగ్ ఇటలీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక బాలన్స్ ఇక్కడ తీసేసి ఆగస్ట్ లోనే మూవీని రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఐరా క్రియేషన్స్ బ్యానర్ తో శౌర్య ఫామిలీనే నిర్మిస్తున్న ఈ మూవీ బడ్జెట్ సబ్జెక్టు డిమాండ్ మేరకు ఛలో కంటే ఎక్కువే పెడుతున్నారని టాక్. శ్రీనివాస చక్రవర్తి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్న శౌర్య అలనాటి క్లాసిక్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. ఇది పూర్తి ఎంటర్ టైనర్ జానర్ లో రూపొందుతున్న చిత్రమని ఛలోని మించిన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు చక్రవర్తి దీన్ని డీల్ చేస్తున్న విధానం పట్ల హ్యాపీగా ఉన్న శౌర్య కొత్త సినిమా అమ్మమ్మ గారిల్లు గొప్ప విజయం సాధించలేదు కానీ ఫామిలీ మూవీగా కాంప్లిమెంట్స్ అయితే దక్కించుకుంది. అందుకే @నర్తనశాలతో మరో సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు శౌర్య.

నర్తనశాల మహాభారతంలోని ఒక కీలక ఘట్టం. అప్పట్లో వచ్చిన సినిమాలో బృహన్నలగా ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్ ఇప్పటికీ మరపురానిదిగా ఉంటుంది. ఆ పేరుతో మళ్ళి సినిమా రాలేదు. ఇప్పుడు ఈ సినిమాకు ఆ పేరుని పెట్టడం చూస్తే సాహసమే అని చెప్పొచ్చు. మోడరన్ బృహన్నలగా కాసేపు అల్లరి చేసే పాత్రలో నాగ శౌర్య ఉండొచ్చు అనే వార్త గతంలోనే ప్రచారంలోకి వచ్చింది. ఇందులో డాన్స్ ని బేస్ చేసుకున్న కామెడీ ఉంటుందని శౌర్య హింట్ ఇస్తున్నాడు. ఇది ఈ ఏడాదిలో శౌర్యకు నాలుగో సినిమా అవుతుంది. ఛలో-కణం-అమ్మమ్మగారిల్లు తర్వాత వచ్చేది నర్తనశాల. దాదాపు అన్ని తెలుగుదనం ఉట్టిపడే టైటిల్స్ ని ఎంచుకుంటున్న నాగ శౌర్య తన టేస్ట్ ని నర్తనశాలతో మరోసారి బయటపెట్టుకున్నారు. ఆగస్ట్ లో మంచి పోటీ ఉన్న నేపథ్యంలో @నర్తనశాల ఏ డేట్ ని సెట్ చేసుకుంటుందో వేచి చూడాలి.